PM Vishwakarma Yojana : రూ.2 లక్షల రుణం, రూ.15 వేల సాయం.. కేంద్రం కొత్త పథకం, పూర్తి వివరాలు

ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన సంప్రదాయ కళాకారులు, చేనేతకారులు, స్వర్ణకారులు, వడ్రంగులు, రజకులు, క్షురకుల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.PM Vishwakarma Yojana Scheme

PM Vishwakarma Yojana Scheme (Photo : Google)

PM Vishwakarma Yojana Scheme : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో కొత్త పథకం తీసుకొచ్చింది. అదే పీఎం విశ్వకర్మ యోజన స్కీమ్. ఈ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ స్కీమ్ కింద బ్రాహ్మణులు, చర్మకారులు, కమ్మరి, కుమ్మరి, ఇతర కులవృత్తుల వారికి రూ.2లక్షల వరకు రుణం ఇవ్వనున్నారు. గరిష్టంగా 5శాతం వడ్డీతో ఈ రుణాన్ని కేంద్రం అందించనుంది.

ఇక, చేతివృత్తుల వారికి రోజుకు రూ.500 ఉపకార వేతనంతో శిక్షణ ఇచ్చి.. తర్వాత పరికరాల కొనుగోలుకు రూ.15వేల ఆర్థిక సాయం చేయనున్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 17న ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించనుంది.

Also Read: టీడీపీకి శ్రీదేవి టెన్షన్..! చంద్రబాబు ఏం చేయనున్నారు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు?

ఆగస్ట్ 15న ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట నుండి విశ్వకర్మ పథకాన్ని ప్రకటించారు. నేడు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద చేతివృత్తుల వారికి రాయితీపై రుణాలు ఇస్తారు. పీఎం విశ్వకర్మ పథకం కింద చేతివృత్తుల వారికి రూ.2 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తామని కేంద్ర మంత్రులు తెలిపారు. గరిష్ఠంగా 5 శాతం వడ్డీతో ఈ రుణాలు పొందవచ్చన్నారు. ఈ స్కీమ్ కోసం కేంద్రం రూ.13 వేల కోట్లను వెచ్చించనుంది. ఈ పథకం ద్వారా 30 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది.

ఈ పథకంతో ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన సంప్రదాయ కళాకారులు, చేనేతకారులు, స్వర్ణకారులు, వడ్రంగులు, రజకులు, క్షురకుల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని కేంద్రం తెలిపింది.

Also Read: పినిపే విశ్వరూప్‌ లక్ష్యంగా పావులు కదుపుతున్న ప్రత్యర్థులు