ప్రాణాలకు తెగించి రైలుకి ఎదురెళ్లి దేవుడిలా చిన్నారిని కాపాడిన రియల్ హీరోకి సూపర్ గిఫ్ట్

వేగంగా వస్తున్న రైలుకి ఎదురెళ్లి తన ప్రాణాలను పణంగా పెట్టి పట్టాలపై పడిన చిన్నారిని కాపాడిన రైల్వే ఉద్యోగి మ‌యూర్ షెల్కే గుర్తున్నాడు కదూ. ఆ రియల్ హీరో సాహసానికి సూపర్ గిఫ్ట్ అందింది. మయూర్ షెల్కే ధైర్యసాహసాలకు ఫిదా అయిన మహీంద్రాకు చెందిన జావా మోటార్‌ సైకిల్స్ కోఫౌండ‌ర్ అనుప‌మ్ త‌రేజా..

Pointsman Mayur Shelke Honoured By Jawa Motorcycles

Mayur Shelke Jawa Bike : వేగంగా వస్తున్న రైలుకి ఎదురెళ్లి తన ప్రాణాలను పణంగా పెట్టి పట్టాలపై పడిన చిన్నారిని దేవుడిలా కాపాడిన రైల్వే ఉద్యోగి మ‌యూర్ షెల్కే గుర్తున్నాడు కదూ. ఆ రియల్ హీరో సాహసానికి సూపర్ గిఫ్ట్ అందింది. మయూర్ షెల్కే ధైర్యసాహసాలకు ఫిదా అయిన మహీంద్రాకు చెందిన జావా మోటార్‌ సైకిల్స్ కోఫౌండ‌ర్ అనుప‌మ్ త‌రేజా.. ఆయనకు ఖరీదైన బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. జావా 42 గోల్డెన్ స్ట్రైప్స్ నెబులా బ్లూ క‌ల‌ర్‌లో ఉన్న ఈ బైక్ ధ‌ర రూ.ల‌క్ష‌న్న‌రకు పైనే కావ‌డం విశేషం. ఈ మేరకు.. ముందుగా మాట ఇచ్చిన‌ ప్రకారం.. మ‌యూర్‌కు బైక్ ఇచ్చిన‌ట్లు ఆ సంస్థ ట్వీట్ చేసింది.

మహారాష్ట్రలోని వంగని రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫామ్ పై తన తల్లితో కలిసి వెళ్తున్న చిన్నారి ప్ర‌మాద‌వ‌శాత్తూ ప‌ట్టాల‌పై ప‌డింది. పైకి రాలేక గట్టిగా ఏడుస్తోంది. అటు వైపు నుంచి ఓ రైలు వేగంగా వస్తోంది. ఇది గమనించిన రైల్వే పాయింట్స్ మెన్ మయూర్ షెల్కే సాహసం చేశాడు. అటువైపు నుంచి వేగంగా రైలు దూసుకొస్తున్నా.. భయపడకుండా ప్రాణాలకు తెగించి రైలుకి ఎదురుగా పట్టాలపై వేగంగా పరిగెత్తాడు.

రైలు దగ్గరికి వచ్చేలోగా చిన్నారిని కాపాడాడు. తను కూడా ప్లాట్ ఫామ్ పైకి ఎక్కేశాడు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఆ వీడియో వైర‌ల్ అయింది. ప్రాణాలకు తెగించి చిన్నారిని కాపాడిన మ‌యూర్ షెల్కే ఒక్క‌సారిగా నేష‌న‌ల్ హీరో అయిపోయాడు. రియల్ హీరో అంటూ దేశవ్యాప్తంగా అతడి సాహసాన్ని మెచ్చుకుంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి.