మెట్రో రైలు కింద పడి పోలీస్ అధికారి ఆత్మహత్య 

  • Publish Date - April 4, 2019 / 11:05 AM IST

ఢిల్లీ: పోలీస్ ఉన్నతాధికారి ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీలో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ అజయ్ కుమార్ జహంగీర్‌పురి మెట్రో స్టేషన్ వద్ద మెట్రో రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సమాచారం అందుకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఏఎస్‌ఐ ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
 

కాగా ఢిల్లీ మోట్రో స్టేషన్లలో ఈ ఆత్మహత్య  మొదటిసారి ఏమి కాదు.మెట్రో స్టేషన్ వద్ద ఆత్మహత్యల ఘటనలు ఒకటీ రెండూ కాదే ఒక్క నెలలోనే ఏకంగా నాలుగు ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ ఫ్లాట్‌ఫామ్స్ ప్రాంతంలో సరైన జాగ్రత్తలు తీసుకోవటం నిర్లక్ష్యం ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయనే వాదన కూడా ఉంది. కాగా ఇప్పటికైనా మెట్రో స్టేషన్లలో తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.