facebook లో పొలిటికల్ జోరు : రూ. 8 కోట్ల యాడ్స్ 

  • Publish Date - March 28, 2019 / 03:58 AM IST

ఢిల్లీ: సోషల్ మీడియా ఎన్నికలకు ప్రధాన ప్రచారాస్త్రంగా మారిపోయింది. కొంతకాలం క్రితం నేతలు ప్రచారం ఓటర్ల ఇంటింటికీ వెళ్లి చేసేవారు. తరువాత బహిరంగ సభ, రోడ్ షోలు వంటివి చేసేవారు. ఇప్పుడు వీటితో పాటు సోషల్ మీడియా ప్రచారంలో అన్ని పార్టీలు దూసుకుపోతున్నాయి. ప్రపంచం అంతా స్మార్ట్ లోకంలో విహరిస్తుంటే పొలిటికల్ రంగులు ఫేస్ బుక్ లో హల్ చల్ చేస్తున్నాయి. పొలిటికల్ నేతలు స్మార్ట్ ప్రచారంలో భాగంగా ఫేస్ బుక్ లో ప్రకటించేసుకుంటున్నారు. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరనున్న క్రమంలో ఫేస్ బుక్ లో పొలిటికల్ యాడ్స్ 8 కోట్లను దాటేశాయి. 

ఈ క్రమంలో ఫేస్ బుక్ లో రాజకీయ ప్రకటనల విలువ రూ. 8.38 కోట్లకు చేరుకుంది. ఎఫ్‌బీలో ప్రకటనలు ఇవ్వడంలో బీజేపీతో పాటు ఆ పార్టీకి మద్దతునిచ్చే పార్టీలు ఫేస్ బుక్ యాడ్స్ ఇవ్వటంతో అగ్రస్థానంలో ఉన్నాయి. 2019 ఫిబ్రవరి నుంచి మార్చి 16 వరకూ ఫేస్‌బుక్‌లో రూ. 6.88 కోట్ల రూపాయల విలువైన మొత్తం 34,048 ప్రకటనలు (యాడ్స్) వచ్చాయి. ఫేస్‌బుక్ రిపోర్టును అనుసరించి మార్చి 23 నాటికి ప్రకటనల సంఖ్య 41,514కు చేరుకుంది. దీని కోసం రాజకీయ పార్టీలు రూ. 8.38 కోట్లు ఖర్చుచేశాయి. ముఖ్యంగా ‘మన్ కీ బాత్’ పేజీలో అత్యధికంగా 3,700 ప్రకటనలు వచ్చాయి. వీటికి  రూ. 2.23 కోట్లు ఖర్చుచేశారు. దీనితోపాటు ‘మై ఫస్ట్ ఓట్ ఫర్ మోదీ‘, ‘నమో కే సాథ్ నేషన్’ పేజీలలో అత్యధికంగా ప్రకటనలు ఉన్నాయి.