Political Parties Funds
Political Parties Collected Funds : రాజకీయ పార్టీలకు సంబంధించి నిధుల సేకరణలో బీజేపీ టాప్ ప్లేస్‌లో ఉంది. ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందిన 35 పార్టీలు 2019-20 కి గాను అడిట్ రిపోర్ట్‌ను సమర్పించాయి. 2019-20 సంవత్సరానికి భారతీయ జనతా పార్టీకి వచ్చిన మొత్తం చందా రూ.276 కోట్ల 45 లక్షలు. ఇందులో 271 కోట్ల రూపాయలు ఎలక్ట్రికల్ ఫండ్ రూపంలో బీజేపీ ఆర్జించింది. జన్‌కళ్యాణ్ ఎలక్ట్రోరల్ ట్రస్టు నుంచి రూ.45 కోట్ల 95 లక్షలు, ఏబీ జనరల్ ట్రస్ట్ నుంచి రూ.9 కోట్లు, సమాజ్ ఎలక్ట్రోరల్ ట్రస్ట్ నుంచి రూ.3 కోట్ల 75 లక్షలు చందా రూపంలో బీజేపీ ఆదాయాన్ని సమకూర్చుకుంది.
ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి 58 కోట్ల రూపాయలు మాత్రమే చందా రూపంలో వచ్చాయి. ప్రుడెంట్ ఎలక్ట్రోరల్ ట్రస్ట్ నుంచి 31 కోట్ల రూపాయలు, జన కళ్యాణ్ ఎలక్ట్రోరల్ ట్రస్ట్ నుంచి 25 కోట్లు, సమాజ్ ఎలక్ట్రోరల్ ట్రస్ట్ నుంచి 2 కోట్ల చందాను కాంగ్రెస్ పార్టీ ఆర్జించింది.
బీజేపీ తర్వాత అత్యధిక చందాలు సమకూర్చుకున్న పార్టీ టీఆర్‌ఎస్. ఈ పార్టీకి రూ. 130 కోట్లు 46 లక్షల చందాలు వచ్చాయి. ఆ తర్వాత శివసేనకు రూ.130 కోట్ల 46 లక్షలు, వైసీపీకి రూ. 92 కోట్ల 2 లక్షల చందాల రూపంలో ఆర్జించాయి. బీజేడీకి రూ.90 కోట్ల 35 లక్షలు, ఎఐఎడిఎంకేకు రూ.89 కోట్ల 6 లక్షలు, డీఎంకేకు 64 కోట్ల 90 లక్షలు, ఆప్‌కు 49 కోట్లు 65 లక్షలు చందాలుగా స్వీకరించాయి. ప్రాంతీయ పార్టీలకు ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలోనే అధికంగా ఆదాయం సమకూరింది.
Read More : TTD: తిరుమలలో యుద్ధకాండ పారాయణం