TTD: తిరుమలలో యుద్ధకాండ పారాయణం

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో యుద్ధకాండ అఖండ పారాయణ దీక్ష నిర్వహించనున్నట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు

TTD: తిరుమలలో యుద్ధకాండ పారాయణం

Ttd

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో యుద్ధకాండ అఖండ పారాయణ దీక్ష నిర్వహించనున్నట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 30 రోజులపాటు దీనిని కొనసాగిస్తామని తెలియచేశారు. యుద్ధకాండలో రాక్షస సంహారం జరుగుతుందని కరోనా కూడా రాక్షసితో సమానమని ఈవో ధర్మారెడ్డి అన్నారు. ఇక యుద్ధ కాండ పారాయణంతో కరోనా నశిస్తుందని వేదపండితులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి గురువారం అంకురార్పణ చేయనున్నారు. ఈ నెల 11 నుంచి జులై 10 తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి రోజు ఉదయం 8:30 గంటలకు ప్రారంభం అవుతుంది.

ఇక తిరుమల భక్తుల రద్దీ విషయానికి వస్తే మంగళవారం 11302 మంది తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం హుండీ ఆదాయం రూ.87 లక్షలు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. దర్శనానికి వచ్చిన వారిలో 3710 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. జూన్ 21తో టీటీడీ పాలకమండలి గడువు ముగుస్తుండటంతో ఈనెల 19న టీటీడీ పాలకమండలి సమావేశం జరగనుంది.