చూసి రాయవచ్చు…ఆ యూనివర్సిటీలో ఓపెన్ బుక్ ఎగ్జామ్స్

  • Published By: venkaiahnaidu ,Published On : September 18, 2020 / 05:55 PM IST
చూసి రాయవచ్చు…ఆ యూనివర్సిటీలో  ఓపెన్ బుక్ ఎగ్జామ్స్

Updated On : September 18, 2020 / 6:06 PM IST

పాండిచ్చేరి యూనివర్శిటీ సరికొత్త విద్యావిధానానికి తెర తీసింది. యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్( UGC) గైడ్ లైన్స్ ప్రకారం… చివరి సెమిస్టర్(end-semester)విద్యార్థులకు ఓపెన్ బుక్ విధానంలో పరీక్షలను నిర్వహిస్తామని పాండిచ్చేరి యూనివర్శిటీ తెలిపింది. ఆన్‌లైన్ / ఆఫ్‌లైన్ / బ్లెండెడ్ మోడ్ ‌లో రాసే విద్యార్థులకు న్యాయమైన మరియు సమానమైన అవకాశాన్ని కల్పించడంలో భాగంగా “ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్” మోడ్ కింద ఎండ్ సెమిస్టర్ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు గురువారం(సెప్టెంబర్-17,2020)విడుదల చేసిన ప్రకటనలో యూనివర్శిటీ తెలిపింది.



పరీక్ష యొక్క వ్యవధి, పరీక్షా విధానం మరియు ఇతర పరిస్థితులు మారవు. విద్యార్థులు తమ సమాధానాలను A4 షీట్స్ లో రాయాల్సి ఉంటుందని యూనివర్శిటీ తెలిపింది..

పరీక్ష సమయంలో, ప్రశ్నలకు ఆన్సర్(సమాధానం)ఇవ్వడానికి … విద్యార్థులు బుక్స్ ,స్టడీ మెటీరియల్స్, నోట్స్ తీసుకుని రావడానికి అనుమతించబడతారు. అయితే, ఇతర వనరుల నుండి సమాధానాలు కాపీ చేయరాదని పాండిచేరి విశ్వవిద్యాలయం తెలిపింది. ప్రశ్నలకు కావాల్సిన సమాధానాలను రెఫరెన్స్ పుస్తకాలు, నోట్ బుక్స్‌, ఇతర స్టడీ మెటీరియల్ ‌లో చూసి రాయాల్సి ఉంటుందని తెలిపారు.

పరీక్ష ముగిసిన 30 నిమిషాల్లో విద్యార్థులు తమ జవాబు పత్రాలను సమర్పించాలని యూనివర్శిటీ కోరింది. వ్రాసిన అన్ని పేజీలను స్కాన్ చేయాలి మరియు అదేవిధంగా ఒకే ఫైల్ ‌లో (పిడిఎఫ్ ఫార్మాట్) సేవ్ చేయాలి. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, సబ్జెక్ట్, కోర్సు, తేదీ మరియు పూర్తి సంతకాన్ని మొదటి పేజీలో రాయాలి. సమాధానాలు రెండవ పేజీ నుండి ప్రారంభం కావాలని అధికారిక ప్రకటనలో యూనివర్సిటీ తెలిపింది.


కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడంలో భాగంగా.. పరీక్షా కేంద్రంలో విద్యార్థులు ఒకరి నుంచి మరొకరు తమ పుస్తకాలు, నోటబుక్స్, ఇతర స్టడీ మెటీరియల్‌ను పరస్పరం బదలాయించుకోవడానికి అనుమతి ఇవ్వట్లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్ని కోవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించేలా ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటామని యూనివర్శిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్పష్టం చేశారు.