సిగ్నల్స్‌ కోసం రంగులరాట్నం ఎక్కిన మంత్రి

MP minister మధ్యప్రదేశ్‌లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ప్రజల సమస్యలు తీర్చేందుకు మధ్యప్రదేశ్​ మంత్రి బ్రిజేంద్ర సింగ్ యాదవ్​ జయింట్​ వీల్​ ఎక్కి అధికారులను సంప్రదించారు. ఆయన పర్యటించిన గ్రామంలో సరైన సిగ్నల్స్​ లేకపోవడమే ఇందుకు కారణం. ఆదివారం సోషల్ మీడియాలో ఈ ఘటనకి సంబంధించిన ఫోటోలు ప్రత్యక్షమవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఓ కార్యక్రమంలో పాల్గోనేందుకు మధ్యప్రదేశ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీరింగ్‌ మంత్రి బ్రజేంద్రసింగ్‌ యాదవ్‌ ఇటీవల అశోక్​నగర్​ జిల్లా సురేల్​ గ్రామానికి 9 రోజుల పర్యటనకు వెళ్లారు. అయితే ఆ గ్రామంలో సరైన నెట్​వర్క్​ లేదు. దీంతో మంత్రి ప్రతి రోజు రంగులరాట్నం ఎక్కి 50 అడుగుల ఎత్తులో కుర్చోని ఫోన్‌ మాట్లాతున్నారు. ఆయనతో పాటు కెమెరామెన్‌, ఫోటోగ్రాఫర్లు కూడా ఆ రంగులరాట్నం ఎక్కి మంత్రి ఫోటోలు, వీడియోలు కవర్‌ చేస్తున్నారు. రంగులరాట్నం ఎక్కి ఫోన్‌ మాట్లాడుతున్న మంత్రి ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డిజిటల్‌ ఇండియాపై నెటిజన్లు తమదైన శైలిలో మిమ్స్‌ క్రియోట్‌ చేసి షేర్‌ చేస్తున్నారు.

దీనిపై మంత్రి మాట్లాడుతూ.. భగవత్‌ కథ, శ్రీరామ్‌ మహాయగ్య కార్యక్రమాల్లో పాల్గోనేందుకు ఈ గ్రామానికి వచ్చాను. 9 రోజులు ఇక్కడే ఉంటాను. ఈ క్రమంలో ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రతి రోజు నా వద్దకు వస్తున్నారు. ఇక్కడ మొబైల్ సిగ్నల్స్ సరిగా అందడం లేదు. దీంతో నేను వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకేళ్లలేకపోతున్నా. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకేళ్లేందుకు ప్రతి రోజు ఈ రంగులరాట్నం ఎక్కి అధికారులతో మాట్లాడుతున్నానని చెప్పారు.