లైంగిక వేధింపుల కేసులో ముందస్తు బెయిల్ కోసం కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరు కోర్టును ఆశ్రయించారు. సెషన్స్ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను ఇప్పటికే జేడీఎస్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆయన సిట్ ముందు శుక్రవారం హాజరుకానున్నారు.
ఏప్రిల్ 26న కర్ణాటకలో పోలింగ్ జరిగినప్పుడు తనపై ఎలాంటి కేసు లేదని, తన విదేశీయాత్ర ముందస్తు ప్రణాళికతో సాగిందని రేవణ్ణ చెప్పారు. ఇప్పటికే అశ్లీల వీడియోల కేసుకు సంబంధించి ఇద్దరు ప్రధాన నిందితులను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.
వారు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు హాజరుకాగా వారిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్‌లను ఆ ఇద్దరు నిందితులు చేతన్ గౌడ, నవీన్ గౌడ ఇచ్చారు.
ఇప్పటికే ప్రజ్వల్ రేవణ్ణపై హోలెనరసిపుర టౌన్ పోలీస్ స్టేషన్‌లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తనను లైంగిక వేధింపులకు గురిచేశారని ఆరోపిస్తూ ఏప్రిల్ 28న ప్రజ్వల్ రేవణ్ణ ఇంట్లో పనిచేసే పనిమనిషి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
Also Read: ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిజ స్వరూపం అంటూ లేఖలు కలకలం