Lawyer Bail: టైపిస్ట్‌ను తిట్టిపోసిన లాయర్ ముందస్తు బెయిల్‌కు నో చెప్పిన కోర్టు

కోర్టు స్టాఫ్‌ను తిట్టిపోసి.. చర్యలు తీసుకోబోయే ముందు యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ పెట్టుకున్న లాయర్‌కు నో చెప్పింది కోర్టు. నోటీస్ అందుకున్న లాయర్.. పోలీస్ స్టేషన్ కు హాజరై స్టే

Bail Reject

Lawyer Bail: కోర్టు స్టాఫ్‌ను తిట్టిపోసి.. చర్యలు తీసుకోబోయే ముందు యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ పెట్టుకున్న లాయర్‌కు నో చెప్పింది కోర్టు. నోటీస్ అందుకున్న లాయర్.. పోలీస్ స్టేషన్ కు హాజరై స్టేట్మెంట్ ఇవ్వాలని తెలపగా, స్టేషన్ కు గైర్హాజరీ అయ్యారు.

ముంబైలోని ములుంద్ ప్రాంతంలో ఉన్న మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ 53వ కోర్టును అటాచ్ చేశారు టైపిస్ట్. ఇన్వార్డ్, అవుట్వార్డ్ కరెస్పాండెన్స్ కోసం సర్టిఫైడ్ కాపీలు ప్రిపేర్ చేస్తుంటారు ఆ టైపిస్ట్. ప్రొసిక్యూషన్ కథనం ప్రకారం.. 2021 డిసెంబర్ 29న టైపిస్ట్.. ఇతర స్టాఫ్ తో కలిసి తన పని చేసుకుంటుండగా కోపంగా వచ్చిన లాయర్ ఆమె చేతిలో ఫైల్ లాగేసుకున్నాడు. పనిచేయడాన్ని అడ్డుకున్నాడు.

తనకు సర్టిఫైడ్ కాపీలు ఇవ్వలేదని, తనకు సహకరించలేదని సావంత్ ఆరోపించడం మొదలుపెట్టాడు.

తనకు జారీ చేసిన సర్టిఫైడ్ కాపీలు సరైనవి కావని.. ఈ సంగతి ముందుగానే చెప్పానని, ఇతర కోర్టులు జారీ చేసిన సర్టిఫైడ్ కాపీలను చూపిస్తానంటూ, తదనుగుణంగా సర్టిఫైడ్ కాపీలను తనకు ఇవ్వాల్సి ఉంటుందని ఆమె చెప్పినా వినిపించుకోలేదు. సావంత్ ఆమెపై కోపంగా అరవడం ప్రారంభించడంతో ఆ తర్వాత ఒక పోలీసు హెడ్ కానిస్టేబుల్ అక్కడికి వచ్చాడు. సావంత్ తన బ్యాగ్‌ని టైపిస్ట్ టేబుల్‌పై కొట్టి ఫైళ్లను చిందరవందర చేశాడు.

Read Also : చిత్ర రామకృష్ణ బెయిల్ పిటిషన్ కొట్టివేత

తన మాట వినకపోతే రెండు రోజుల్లోగా బదిలీ చేస్తానంటూ సావంత్ బెదిరింపులకు కూడా దిగాడు. మూడు రోజుల తర్వాత ములుంద్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. సెషన్స్ కోర్టు ముందు సావంత్ కేసును స్వయంగా వాదించుకున్నాడు.

టైపిస్ట్ తరపున వాదించిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీమా దేశ్‌పాండే.. నిందితుడైన లాయర్ కు ప్రాసెస్ మొత్తం తెలుసు. అతనికి సర్టిఫైడ్ కాపీస్ అందకపోతే.. సుపీరియర్ అథారిటీలను కన్సల్ట్ అయి ఎలా సంప్రదించాలో తెలిసిన వ్యక్తి. అలాంటిదేమీ చేయకుండా పబ్లిక్ సర్వెంట్ పై క్రిమినల్ చర్యలకు పాల్పడ్డాడు పలు విషయాల్లో అతణ్ని విచారించాల్సి ఉంది. అతనికి బెయిల్ ఇస్తే సాక్ష్యులను బెదరించే అవకాశం ఉంది’ అని వాదించారు.

సాక్ష్యులంతా టైపిస్ట్ మాటలకే సపోర్ట్ చేస్తుండటంతో.. లాయర్‌కు ముందస్తు ఇవ్వడానికి నిరాకరించింది కోర్టు.