Queen Elizabeth II: క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు లండన్ చేరుకున్న భారత రాష్ట్రపతి

ఈ విషయమై లండన్ చేరుకున్న వెంటనే భారత రాష్ట్రపతి అధికారిక ట్విట్టర్ ఖాతాలో లండన్ విమానాశ్రయానికి చేరుకుని, విమానం దిగుతూ అభివాదం చేస్తున్న ద్రౌది ముర్ము ఫొటోను షేర్ చేస్తూ ‘‘క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు హాజరై భారత ప్రభుత్వం తరపున నివాళులు అర్పించేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లండన్ చేరుకున్నారు’’ అని ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరవ్వడంతో పాటు ముర్డు మూడు రోజుల బ్రిటన్‭లో పర్యటించనున్నారు

Queen Elizabeth II: బ్రిటన్ మాజీ రాణి క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు హాజరయ్యేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం సాయంత్రం లండన్ చేరుకున్నారు. బ్రిటన్ ప్రభుత్వం ఆహ్వానం మేరకు భారత ప్రభుత్వం తరపున ఆమె ఈ కార్యక్రమానికి హజరయ్యారు. సెప్టెంబర్ 8న స్కాట్లాండ్‭లోని బల్మోరల్ కాసిల్ వేసవి విడిది నివాసంలో క్వీన్ ఎలిజబెత్(96) మరణించారు. కాగా, సెప్టెంబర్ 19 (సోమవారం) ఉదయం వెస్ట్‭మినిస్టర్ అబ్బేలో అంత్యక్రియలు నిర్వహించానున్నారు.

ఈ విషయమై లండన్ చేరుకున్న వెంటనే భారత రాష్ట్రపతి అధికారిక ట్విట్టర్ ఖాతాలో లండన్ విమానాశ్రయానికి చేరుకుని, విమానం దిగుతూ అభివాదం చేస్తున్న ద్రౌది ముర్ము ఫొటోను షేర్ చేస్తూ ‘‘క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు హాజరై భారత ప్రభుత్వం తరపున నివాళులు అర్పించేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లండన్ చేరుకున్నారు’’ అని ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరవ్వడంతో పాటు ముర్డు మూడు రోజుల బ్రిటన్‭లో పర్యటించనున్నారు. ఎలిజబెత్ అంత్యక్రియలకు సోమవారం ఉదయం జరగనుండగా, ఆదివారం సాయంత్రం బంకింగ్‭హమ్ ప్యాలెస్‭లో కింగ్ చార్లెస్-3 ఆధ్వర్యంలో జరిగే ప్రపంచాధినేత కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము పాల్గొంటారు.

సెప్టెంబర్ 12న ఇండియాలోని బ్రిటిష్ హైకమిషనర్‭ను కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ కలిసి ఎలిజబెత్ మరణానికి భారత్ తరపున సంతాపం వ్యక్తం చేశారు. దీనికి ఒక రోజు ముందు దేశంలో జాతీయ సంతాప దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఇక వారం రోజుల క్రితమే ద్రౌపది ముర్ము బ్రిటన్ పర్యటన గురించి కేంద్ర విదేశాంగ శాఖ అధికారికంగా స్పష్టం చేసింది.

Chinese astronauts spacewalk: చైనా కొత్త అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ వాక్ చేసిన ఇద్దరు వ్యోమగాములు

ట్రెండింగ్ వార్తలు