రాష్ట్రపతికి బైపాస్ సర్జరీ విజయవంతం
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కి ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు విజయవంతంగా బైపాస్ సర్జరీ నిర్వహించారు.

President Kovinds Bypass Surgery Conducted Successfully
President Kovind రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కి ఎయిమ్స్ డాక్టర్లు విజయవంతంగా బైపాస్ సర్జరీ నిర్వహించారు. కేంద్ర రక్షణశాఖ మంత్రి ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. రాష్ట్రపతి ఆరోగ్యం కుదుటగా ఉందని.. కోలుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ వైద్యులను ఆయన అభినందించారు. రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితిని ఎయిమ్స్ డైరెక్టర్‌తో మాట్లాడి తెలుసుకున్నట్లు రాజ్ నాథ్ చెప్పారు. త్వరలోనే రాష్ట్రపతి కోలుకోవాలని రాజ్ నాథ్ ఆకాంక్షించారు.
ఛాతీలో నొప్పితో మార్చి 27న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఛాతీ నొప్పితో ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్ లో చేరిన విషయం తెలిసిందే. సాధారణ వైద్య పరీక్షల అనంతరం డాక్టర్లు ఆయననని ఢిల్లీలోని ఎయిమ్స్‌కి సిఫారసు చేశారు. దీంతో గత శనివారం ఎయిమ్స్ లో చేరారు రాష్ట్రపతి. వైద్య పరీక్షల అనంతరం రామ్‌నాథ్ కోవింద్‌కు బైపాస్ సర్జరీ చేయాలని ఎయిమ్స్ డాక్టర్లు నిర్ణయించారు. ఈ మేరకు తాజాగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో వైద్యులు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కు బైపాస్ సర్జరీ విజయవంతంగా ముగించారు.