భారతీయులను ఎవరూ విడదీయలేరు : ప్రధాని మోడీ

భారతీయులను ఎవరూ విడదీయలేరని ప్రధాని మోడీ తెలిపారు. భారత సమగ్రతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం చిహ్నం అన్నారు.

  • Publish Date - October 31, 2019 / 05:53 AM IST

భారతీయులను ఎవరూ విడదీయలేరని ప్రధాని మోడీ తెలిపారు. భారత సమగ్రతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం చిహ్నం అన్నారు.

భారతీయులను ఎవరూ విడదీయలేరని ప్రధాని మోడీ తెలిపారు. భారత సమగ్రతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం చిహ్నం అన్నారు. ఐక్యతా నినాదానికి పటేల్ ఆద్యుడు అన్నారు. జాతీయ సమైక్యతా దినోత్సవాల సందర్భంగా గురువారం (అక్టోబర్ 31, 2019) గుజరాత్ లోని ఐక్యతా విగ్రహం దగ్గర ప్రధాని నివాళులర్పించారు. పారామిలిటరీ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మోడీ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం దేశానికి గర్వ కారణమన్నారు. దేశ ఐక్యతలో క్రీడలది ముఖ్య పాత్ర అని అన్నారు. 

దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఐక్యత కోసం పోరాడుతున్నారని తెలిపారు. పొరుగు దేశాలు ఈ ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు చేస్తున్నాయని చెప్పారు. మనల్ని విడగొట్టేందుకు శత్రువులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. భారతీయులను ఎవరూ విడదీయలేరని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మోడీ పాకిస్తాన్ ను హెచ్చరించారు. దేశంలో ఉగ్రవాద వ్యాప్తికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. మన సైనికులు పాకిస్తాన్ కు వారి భాషలోనే సమాధానం చెబుతారని తెలిపారు.

ఏకతా దవిస్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ.. ప్రజలతో జాతీయ సమైక్యతా ప్రతిజ్ఞ చేయించారు. దేశ సమైక్యత, సమగ్రతలను కాపాడతాని ప్రతిజ్ఞ తీసుకున్నారు. జాతీయ సమైక్యతా దినోత్సవంలో భాగంగా గుజరాత్‌ పోలీసులు, పారామిలటరీ బలగాలు ప్రదర్శించిన విన్యాసాలను మోదీ తిలకించారు. పైప్‌ బ్యాండ్‌, బ్రాస్‌ బ్యాండ్‌ బృందాలు వీనుల విందైన సంగీతం ఆలపించాయి. 

జాతీమ సమైక్యతా దినోత్సవంలో భాగంగా పారామిలటరీ బలగాలు ప్రదర్శించిన విన్యాస్యాలను మోదీ తిలకించారు. అణుదాడులు, రసాయన ఆయుధదాడులు  జరిగితే ప్రజలను రక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రదర్శన ఇచ్చారు. అలాగే  ఉగ్రవాదులను మట్టుపెట్టడంపై పారామిలటరీ బలగాలు ప్రదర్శన ఇచ్చాయి. మోటార్‌ బైక్‌లతో ప్రదర్శంచిన విన్యాసాలను మోదీ తిలకించారు.