Ayodhya Deepotsav : గతేడాది రికార్డ్ బ్రేక్.. అయోధ్యలో ‘దీపోత్సవ్’ ఫొటోలను ట్విటర్ లో షేర్ చేసిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే?

ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ ప్రకారం.. ఇదొక అద్భుతం, మరపురాని వేడుకగా అభివర్ణించారు. మిలియన్ల దీపాలతో ప్రకాశించే అయోధ్య నగరం గొప్పదీపాల పండుగతో ..

Ayodhya Deepotsav

PM Narendra Modi : ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ రాష్ట్ర ప్రభుత్వం దీపోత్సవ్ నిర్వహించింది. సరయూ నది తీరంలో నిర్వహించిన ఈ వేడుకలో 51 ఘాట్ లలో ఒకేసారి 22.23 లక్షలకు పైగా దీపాలను వెలిగించి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. గతేడాది 2022 దీపోత్సవ్ వేడుకలోకంటే ప్రస్తుతం 2023లో 6.47 లక్షల దీపాలను అధికంగా వెలిగించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

Also Read : Anasuya Bharadwaj : ఫ్యామిలీతో అనసూయ దీపావళి సెలెబ్రేషన్స్..

ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ ప్రకారం.. ఇదొక అద్భుతం, మరపురాని వేడుకగా అభివర్ణించారు. మిలియన్ల దీపాలతో ప్రకాశించే అయోధ్య నగరం గొప్పదీపాల పండుగతో దేశం మొత్తం ప్రకాశిస్తోందని పేర్కొన్నారు. దీని నుంచి వెలువడే శక్తి భారత దేశమంతటా కొత్త ఉత్సాహాన్ని వ్యాపింపజేస్తోంది. శ్రీరాముడు దేశ ప్రజలందరికీ మేలు చేయాలని, నా కుటుంబ సభ్యులందరికీ స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను.. జై సియారాం అని ప్రధాని మోదీ ట్వీట్ లో పేర్కొన్నారు.

Also Read : PM Modi : LOCలో జవాన్లతో దీపావళి జరుపుకోనున్న ప్రధాని మోదీ

ఇదిలాఉంటే .. యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అయోధ్యలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తొలి ఏడాది 51వేల దీపాలు వెలిగించగా.. ప్రతీయేటా వాటి సంఖ్యను పెంచుతున్నారు. ఈ ఏడాది జరిగిన దీపోత్సవ్ లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. 50 దేశాల రాయబారులు, ఉన్నతాధికారులు ఈ వేడుకలో హాజరయ్యారు.