PM Modi : LOCలో జవాన్లతో దీపావళి జరుపుకోనున్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది కూడా దీపావళి పండుగను జవాన్లతో కలిసి జరుపుకోనున్నారు. దేశ భధ్రత కోసం తమ ప్రాణాల్ని పణంగా పెట్టే ఆర్మీ జవాన్లతో కలిసి ప్రధాని దీపావళి వేడుకల్ని జరుపుకోనున్నారు.

PM Modi : LOCలో జవాన్లతో దీపావళి జరుపుకోనున్న ప్రధాని మోదీ

PM Modi Diwali Celebration with Soldiers

Updated On : November 11, 2023 / 10:48 AM IST

PM Modi Diwali Celebration with Soldiers : ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది కూడా దీపావళి పండుగను జవాన్లతో కలిసి జరుపుకోనున్నారు. అనుక్షణం వేయి కళ్లతో దేశ భధ్రత కోసం తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి.. అహర్నిశలు శ్రమిస్తున్న ఆర్మీ జవాన్లతో కలిసి ప్రధాని దీపావళి వేడుకల్ని జరుపుకుంటుంటారు. ఈ ఏడాది కూడా మోదీ జవాన్లతో కలిసి దీపావళి వేడుకను జరుపుకోనున్నారు. ఒక్కో సంవత్సం ఒక్కో ప్రదేశానికి వెళ్లి జవాన్లతో దీపావళి సంబరాలను పంచుకునే ప్రధాని ఈ ఏడాది జమ్ము కశ్మీర్ లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద దీపావళి సంబరాలను జరుపుకోనున్నారు. ఈ దీవాలీ వేడుకల్లో ప్రధాని జవాన్లకు తానే స్వయంగా తన చేతితో మిఠాయిలు తినిపిస్తుంటారు. ఇటువంటి అరుదైన అనుభూతిని జవాన్లు కూడా చక్కగా ఆస్వాదిస్తుంటారు. స్వయంగా ప్రధానే తమతో కలిసి పండుగ వేడుకలు జరుపుకోవటం జవాన్లు అత్యంత గొప్పగా భావిస్తుంటారు.

ఇలా ప్రధాని ప్రతీ ఏడాది జవాన్లతో దీపావళి వేడుకల్ని జరుపుకోవటానికి ఆసక్తి చూపిస్తుంటారు. గత ఏడాది అంటే 2022లో కార్గిల్ లో సైనికులతో దీపావళి జరుపుకుని వారిలో స్ఫూర్తిని నింపారు. 2018లో ఉత్తరాఖండ్‌లోని హర్షిల్ గ్రామంలోభారతదేశం-చైనా సరిహద్దు సమీపంలో ITBP సిబ్బందితో కలిసి దీపావళిని జరుపుకున్నారు. 2019లో రాజౌరిలోను, 2020లో రాజస్థాన్ లోని జైసల్మేర్ లోను,2021లో నౌషీరా సెక్టార్ లోను.. జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్న ప్రధాని మోదీ ఈ ఏడాది (2023) దీపావళి వేడుకలను జమ్ముకశ్మీర్ లోని ఎల్ఓసీ వద్ద జవాన్లతో జరుపుకోనున్నారు.

ఇలా ప్రతీ ఏడాది ఏదోక ప్రాంతంలో దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉండే భారత ఆర్మీతో కలిసి వేడుకలు జరుపుకుంటుంటారు. ఈ దీపావళి సందర్భంగా 140 కోట్ల భారతీయులంతా దీపావళిని సంతోషంగా జరుపుకోవాలని ట్విట్టర్ వేదికగా తన ఆకాంక్షను వెల్లడించారు.