వీళ్లు వ్యవస్థను ధ్వంసం చేయడంలో ఏ అవకాశాన్నీ వదలలేదు: మోదీ

ఢిల్లీలో ఇటువంటి పరిస్థితులను సృష్టించారని అన్నారు.

ఆమ్‌ ఆద్మీ పార్టీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో నిర్వహించిన బీజేపీ పరివర్తన్ ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. ఢిల్లీ రవాణా వ్యవస్థను ధ్వంసం చేయడంలో ఆప్‌ ఏ అవకాశాన్నీ వదలలేదని అన్నారు. ఢిల్లీలో బస్సుల నిర్వహణపై కూడా ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు.

ఢిల్లీలోని సామాన్య పౌరులు ఎన్నో నష్టాలను చవిచూశారని అన్నారు. ఢిల్లీలో వేసవి కాలం వస్తే తాగునీటి కోసం గొడవలు జరుగుతున్నాయని, వర్షం వస్తే నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారని, చలికాలం వస్తే ఊపిరి పీల్చుకోవడం కష్టమయ్యే పరిస్థితి ఉందని విమర్శించారు. ఢిల్లీలో ఇటువంటి పరిస్థితులను సృష్టించారని అన్నారు.

ఢిల్లీ ప్రజల శక్తి అంతా ఆప్‌కు చెందిన వారితో డీల్‌ చేయడానికే వినియోగిస్తున్నట్లు పరిస్థితులు తయారయ్యాయని మోదీ చెప్పారు. ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీని అధికారంలో నుంచి దించేస్తేనే.. అభివృద్ధి, సుపరిపాలన అందించే డబుల్ ఇంజిన్ పాలన వస్తుందని అన్నారు.

ఆప్‌ ప్రభుత్వం ఇక్కడ ప్రధాన మంత్రి ఆవాస్ యోజనను కూడా సరిగ్గా అమలు చేయడం లేదని అన్నారు. ఢిల్లీలో దాదాపు 30,000 మందికి శాశ్వత గృహాలను నిర్మించడంలో అడ్డంకులు కలుగుతుఉన్నాయని తెలిపారు. పాత పథకాల కింద కట్టిన ఇళ్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఢిల్లీ ప్రజలకు ఆప్ ప్రజలు ఈ ఇళ్లను కేటాయించలేదని చెప్పారు.

Ponnam Prabhakar: ఆ అనుభవం కాంగ్రెస్‌కు ఉంది.. ప్రజా ప్రభుత్వ ఆకాంక్ష ఇదే: పొన్నం ప్రభాకర్