Ponnam Prabhakar: ఆ అనుభవం కాంగ్రెస్‌కు ఉంది.. ప్రజా ప్రభుత్వ ఆకాంక్ష ఇదే: పొన్నం ప్రభాకర్
జనవరి 26 నుంచి నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం అవుతుందన్నారు.

Minister Ponnam Prabhakar
ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపడంలో కాంగ్రెస్ పార్టీకి అనుభవం ఉందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు ఉంచాలనేదే ప్రజా ప్రభుత్వం ఆకాంక్ష అని తెలిపారు.
ప్రజలకు ఎలా సేవ చేయాలో ఆలోచనలు చేస్తున్నామని పొన్నం ప్రభాకర్ చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పలు అభివృద్ధి పనులు, ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అంతకుముందు యాదవుల ర్యాలీలో పాల్గొని డోలు వాయించి అందరిని ఉత్సాహపరిచారు.
భవిష్యత్తులో ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు ఎల్లమ్మ చెరువుకు వచ్చేలా అభివృద్ధి చేసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ప్లాన్ అఫ్ యాక్షన్ కింద ప్రభుత్వ స్థలాలను గుర్తించి ట్రాఫిక్, పార్కింగ్ తదితర వాటిని ఏర్పాటు చేస్తామన్నారు. ఎల్లమ్మ చెరువు అభివృద్ధి తర్వాత రద్దీ పెరగకుండా పార్కింగ్ సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపడతామని వెల్లడించారు.
రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్న రైతు భరోసా కింద గతంలో ఉన్న రూ.10 వేలను ఇప్పుడు రూ.12 వేలకు పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. భూమిలేని రైతు కుటుంబానికి, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ.12 వేల చొప్పున ఇందిరమ్మ ఆత్మీయ కానుక ఇవ్వనున్నట్లు తెలియజేశారు. జనవరి 26 నుంచి నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం అవుతుందన్నారు.
JC Prabhakar Reddy: బీజేపీ మహిళా నేత మాధవీ లతకు క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి