PM MOdi Fire On CM KCR
PM MOdi Fire On CM KCR : మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)పర్యటిస్తున్నారు. భోపాల్ (Bhopal)లో ఏర్పాటు చేసిన సభలో మోదీ ప్రసంగిస్తు తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR)పై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నా ప్రజలారా వినండి అంటూ తనదైన శైలిలో ప్రసంగించిన మోదీ (modi)మీ కుటుంబం బాగుండాలంటే బీజేపీ(BJP)కి ఓటేయండి..కేసీఆర్ (KCR)కుటుంబం బాగుండాలంటే బీఆర్ఎస్ (BRS)కు ఓటేయండి’’అంటూ వ్యాఖ్యానించారు. మీరు,మీ పిల్లలు, మీ కుటుంబం బాగుండాలంటే తప్పనిసరిగా బీజేపీ(BJP)కి ఓటేయండి..అలాకాదు కేసీఆర్ బాగుండాలి..ఆయన కూతురు బాగుండాలి అంటూ కేసీఆర్ కు ఓటేయండి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Pawan Kalyan : తూర్పుకాపుల్లో బలమైన నాయకులున్నా.. వారు వెనుకబడే ఉన్నారు : పవన్ కల్యాణ్
ఇలా భోపాల్ (Bhopal) వేదికగా సీఎం కేసీఆర్ (CM KCR) పై మొట్టమొదటిసారి ప్రధాని మోదీ (Modi)వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారింది. మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు తెరతీస్తాయని చెప్పాలి. ప్రధాని స్వయంగా కేసీఆర్ పై చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ ఆసక్తిని పెంచాయి. ఎందుకంటే మోదీ మొదటిసారి ప్రత్యక్షంగా బహిరంగంగా కేసీఆర్ పై విమర్శలు చేయటం అత్యంత గమనార్హంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించాలనే అర్థం వచ్చేలా క్లియర్ గానే ప్రధాని మోదీ వ్యాఖ్యలున్నాయి. కేసీఆర్ బిడ్డ (కూతురు) గెలవాలంటే బీఆర్ఎస్ కు ఓటేయండీ..దేశ ప్రజలు గెలవాలంటే బీజేపీకి ఓటు వేయండీ అంటూ అత్యంత ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తు దేశ ప్రజలకు భోపాల్ వేదికగా పిలుపునిచ్చారు.
కాగా మధ్యప్రదేశ్ లో ఈ ఏడాది చివరలో అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections)జరుగునున్నాయి. దీంతో మోదీ తన ప్రచార కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అలాగే ఈరోజు ప్రధాని మోదీ భోపాల్ నుంచి ఇండోర్, భోపాల్ నుంచి జబల్ పుర్ కు వెళ్లే రెండు వందే భారత్ రైళ్లను ప్రధాని ప్రారంభించారు. మిలిగిన మూడు వందే భారత్ రైళ్లను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. మడ్ గావ్ నుంచి ముంబై, ధార్వాడ నుంచి బెంగళూరు, హతియా నుంచి పాట్నాకు వెళ్లే మూడు రైళ్లను ప్రధాని పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అనంతం భోపాల్ వేదికగా సీఎం కేసీఆర్ పై విమర్శలు చేయటం రాజకీయ ఆసక్తిని క్రియేట్ చేశారు.
Pawan Kalyan : ఒక్క చోట కూడా వైసీపీని గెలవనివ్వను, ఏపీని నెంబర్ 1 చేస్తా- పవన్ కల్యాణ్