Modi Wears Sikh
Prime Minister Wore Sikh Turban : ఢిల్లీలోని కరియప్పా గ్రౌండ్‌లో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ర్యాలీ అదరహో అనిపించింది. ఎన్‌సీసీ క్యాడెట్లు చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఆర్మీ యాక్షన్, స్లిథరింగ్ మైక్రోలైట్ ఫ్లయింగ్, పారా పైలింగ్‌తో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎన్‌సీసీ క్యాడెట్లు అద్భుత నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్‌సీసీ క్యాడెట్ల విన్యాసాలను తిలకించారు. అనంతరం ప్రసంగించిన ప్రధాని మోదీ… గతంలో తాను కూడా ఎన్‌సీసీలో చురుకుగా పాల్గొన్నానని గుర్తు చేసుకొన్నారు. ప్రస్తుతం ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకొంటున్న వేళ… ఎన్‌సీసీ ర్యాలీ నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
Read More : Samyuktha Menon : మహేష్ పక్కన ‘భీమ్లా నాయక్’ బ్యూటీ
తాను కూడా ఎన్‌సీసీలో చురుకుగా క్యాడెట్‌గా ఉన్నందుకు గర్వపడుతున్నానని మోదీ చెప్పారు. ఎన్‌సీసీలో నేర్చుకొన్న శిక్షణ తనకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఎన్‌సీసీ విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇటీవల ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. గత రెండేళ్లలో లక్షమందికి పైగా ఎన్‌సీసీ క్యాడెట్లను సరిహద్దు ప్రాంతాల్లో మోహరించామని, సైన్యంలో మహిళలకు ఎంతో బాధ్యత పెరిగిందన్నారు. మాదకద్రవ్యాలకు ఎన్‌సీసీ సభ్యులు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. భారత్ ఆత్మనిర్భరత సాధించడంలో యువత పెద్దపాత్ర పోషిస్తున్నట్లు, దేశాభివృద్ధే తొలి ప్రాధాన్యంగా పనిచేసే యువత ఉంటే.. ఆ దేశాన్ని ఆపడం ఎవరికీ సాధ్యం కాదన్నారు.
Read More : Shweta Tiwari : లో దుస్తులపై కామెంట్స్.. క్షమాపణలు చెప్పిన శ్వేతా తివారీ
ప్రతి ఏటా జనవరి 28 రిపబ్లిక్ డే ముగింపు వేడుకల సందర్భంగా ఎన్‌సీసీ క్యాడెట్ ర్యాలీ జరుగుతుందనే విషయం తెలిసిందే. ఈసారి ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ మాత్రం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. సిక్కు క్యాడెట్ తలపాగా, కళ్లజోడు చూపరులను ఆకట్టుకున్నాయి. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్‌లో కూడా ప్రధాని మోదీ బ్రహ్మకమలం చిత్రంతో వున్న ఉత్తరాఖండ్ టోపీని ధరించారు. మణిపూర్ సంప్రదాయానికి చెందిన కడువాను మెడలో వేసుకున్నారు. మొన్న ఉత్తరాఖండ్ టోపీ, మణిపూర్ కండువా.. ఇప్పుడు పంజాబ్ వేషధారణ… ఇవన్నీ త్వరలో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల జరగనుండటంతో ప్రధాని వేసిన ఎలక్షన్ స్టంట్ అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.