2019 సార్వత్రిక ఎన్నికలు వేళ.. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాల్లో మునిగిపోయాయి. పోలింగ్ కు ఇంకా వారం లోపే గడువు ఉంది. ఓటర్లను ఆకర్షించేందుకు పలు పార్టీల నేతలు హామీలు మీద హమీలు గుప్పిస్తున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికలు వేళ.. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాల్లో మునిగిపోయాయి. పోలింగ్ కు ఇంకా వారం లోపే గడువు ఉంది. ఓటర్లను ఆకర్షించేందుకు పలు పార్టీల నేతలు హామీలు మీద హమీలు గుప్పిస్తున్నారు. ఈ తరుణంలో ఎన్నికల కమిషన్ కూడా ఓటింగ్ శాతం పెంచేందుకు ఓటర్లకు.. ఓటు వేయడం ఎంత ముఖ్యమో అవగాహన కల్పిస్తోంది. సమ్మర్ సీజన్ కావడంతో స్కూళ్లకు వేసవి సెలవుల సమయం. చాలామంది పేరంట్స్ తమ పిల్లలతో కలిసి సమ్మర్ ట్రిప్ లకు ప్లాన్ చేస్తుంటారు. ఇది కామన్.. అయితే ఇదే సమ్మర్ లో సార్వత్రిక ఎన్నికలు వచ్చేశాయి. సమ్మర్ ట్రిప్ కోసం ఎన్నికల రోజు.. ఓట్లు వేసే పరిస్థితి ఉండదు. సమ్మర్ ట్రిప్ లపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఓటు వేయడం ఎంత ముఖ్యమో అవగాహన కల్పించేందుకు కర్ణాటకలో ప్రైవేట్ స్కూళ్లు ఓ నిర్ణయానికి వచ్చాయి. ఓటు హక్కును ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టాయి.
ఒక్కో పేరంట్ ఓటుకు ఒక ఎక్స్ ట్రా మార్క్ :
సాధారణంగా పిల్లలు బాగా చదువుకుని మార్కులు తెచ్చుకోవాలని పేరంట్స్ కోరుకుంటారు. అది సహజం. స్కూల్లో పిల్లలకు మార్కులు బాగా వచ్చాయంటే ఎంతో ఆనందపడుతారు. దీన్నే ఆకర్షణ అస్త్రంగా భావించిన ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు పిల్లల పేరంట్స్ ఓటును మార్కులతో ముడిపెట్టేశారు. ఎన్నికల్లో తల్లిదండ్రులు ఓటు వేస్తేనే.. పిల్లలకు ఎక్స్ ట్రా మార్కులు వేస్తామంటూ ఆఫర్ చేస్తున్నాయి. ఈ రకంగా విద్యార్థుల తల్లిదండ్రులను ఓటు వేసేలా ప్రొత్సాహిస్తున్నారు. స్కూల్లోని ప్రతి విద్యార్థి తమ పేరంట్స్ ను ఓటు వేసేలా చూడాలి. ఒక్కో పేరంట్ ఓటుకు ఒక్కో ఎక్స్ ట్రా మార్కు ఆఫర్ చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి విద్యార్థుల పేరంట్స్ కు SMS లు పంపిస్తున్నారు. ఓటు వేసిన అనంతరం తప్పనిసరిగా స్కూల్ కు రావాల్సిందిగా సూచిస్తున్నారు. అప్పుడే విద్యార్థికి అదనపు మార్కులు వేయడం జరుగుతుందని కండీషన్ పెట్టేశారు. 2018 ఏడాది ఎన్నికల్లో కూడా కర్ణాటక ప్రైవేట్ విద్యాసంస్థలన్నీ ఇదే ఫార్మూలాను అమలు చేశాయి. ఈ ఏడాది కూడా సేమ్ ఫార్మూలాను అమలు చేస్తున్నట్టు ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్స్ అసోసియేటడ్ మేనేజ్ మెంట్ ఇన్ కర్ణాటక జనరల్ సెక్రటరీ డి. శశి కుమార్ తెలిపారు.
ఓటు వేశాక.. పేరంట్స్ ఇలా చేయాలి :
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున విద్యార్థుల తల్లిదండ్రులు తప్పకుండా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయాలి. అనంతరం వారు ఓటు వేశాక నేరుగా పిల్లలు చదివే స్కూల్ కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి స్కూల్ యాజమాన్యానికి ఓటు వేసినట్టు (వేలిపై ఇంక్ గుర్తు) చూపించాలి. ఓటు వేసిన రోజైన పర్వాలేదు.. లేదా మరుసటి రోజైన పర్వాలేదు. ఓటు వేసిన వేలిపై సిరా చెరిగిపోనంత వరకు ఎప్పుడైన వచ్చి స్కూల్లో చూపించవచ్చు. దీని ఆధారంగా స్కూల్ యాజమాన్యం.. పిల్లల పేరంట్స్ పేర్లను రిజిస్టర్ చేయించుకోవాలి. అప్పడే స్కూల్లో చదివే విద్యార్థులకు బోనస్ మార్కులను వేయడం జరుగుతుందని జనరల్ సెక్రటరీ శశి కుమార్ తెలిపారు.
2018లో కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటు వేసిన స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రుల్లో వెయ్యి 50 మంది తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు. వీరంతా ఓటు వేసిన ఇంక్ సిరాను చూపించడంతో వారి పిల్లలకు స్కూల్ యాజమాన్యం అదనపు మార్కులను వేసింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కువ సంఖ్యలో ఓటు వేస్తారని, అలాగే తమ పిల్లలకు ఓటు హక్కును వినియోగించుకోవడం ఎంత ముఖ్యమో తెలియజేస్తారని ఆశిస్తున్నట్టు స్కూల్ నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు.