Privatisation Of State Public Sector1
Privatisation of State Public Sector : దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల విక్రయంపై కేంద్ర ప్రభుత్వం మరో ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేటీకరణ బాటలోకి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. సంస్థలను ప్రైవేటీకరణ చేసే రాష్ట్రాలకు కేంద్రం ప్రోత్సాహకాలు ఇవ్వనుంది.
నష్టాల్లో ఉన్న సంస్థలను సకాలంలో మూసేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. దీని కోసం నోడల్ ఏజెన్సీగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజేస్ ఉండనుంది. సంస్థల మూసివేత కోసం కేంద్రం విధివిధానాలను సవరణ చేయనుంది.