×
Ad

priyanka gandhi : కాబోయే కోడలి గురించి ప్రియాంకా గాంధీ ఆసక్తికర పోస్టు.. వారిద్దరి చిన్ననాటి ఫొటో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ

priyanka gandhi : తన కుమారుడు రేహాన్ వాద్రా, కాబోయే కోడలు అవివా బేగ్ కలిసి ఉన్న ఫొటోలను కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు.

priyanka gandhi

  • రేహాన్, అవీవా బేగ్ నిశ్చితార్ధంను ధ్రువీకరిస్తూ ప్రియాంకా గాంధీ పోస్టు
  • వారిద్దరి నిశ్చితార్ధం, చిన్ననాటి ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
  • వారిద్దరూ చిన్నతనం నుంచి స్నేహితులని వెల్లడి 

priyanka gandhi : కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ, పారిశ్రామికవేత్త రాబర్ట్ వాద్రాల కుమారుడు రేహాన్ వాద్రాకు నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఆ విషయాన్ని తాజాగా.. ప్రియాంకా గాంధీ ధ్రువీకరించారు. ఈ మేరకు ప్రియాంక గాంధీ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో ఆసక్తికర పోస్టు చేశారు. రేహాన్, అవీవాబేగ్ కలిసిఉన్న చిన్ననాటి ఫొటోలను షేర్ చేశారు.

రేహాన్, అవీవాబేగ్ నిశ్చితార్ధం రాజస్థాన్ రణతంబోర్‌లో అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. తాజాగా.. ప్రియాంగాంధీ రెహాన్, అవీవాబేగ్ నిశ్చితార్థంకు సంబంధించిన ఫొటోను షేర్ చేయడం ద్వారా నిశ్చితార్ధం జరిగిన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో రేహాన్, అవీవా బేగ్ చిన్నతనంలో కలిసిఉన్న ఫొటోనుసైతం పోస్టు చేశారు. రేహాన్, అవీవా బేగ్‌లు చిన్నతనం నుంచే మంచి స్నేహితులని తెలిపారు.


‘మీ ఇద్దరినీ చాలా ప్రేమిస్తున్నాను. మీరు ఎల్లప్పుడూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ, గౌరవించుకుంటూ ఉండండి. మీకు మూడు సంవత్సరాల వయస్సు నుండి ఉన్న మంచి స్నేహితులుగా ఉండండి’ అంటూ ప్రియాక తన ఇన్‌స్టా పోస్టులో పేర్కొన్నారు.

అవివా బేగ్ గురించి ఆసక్తికర విషయాలు..
అవివా బేగ్ ఢిల్లీకి చెందిన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. ఆమె లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం OP జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో జర్నలిజం కమ్యూనికేషన్ చదివింది. ఢిల్లీలోని మోడరన్ స్కూల్‌లో హ్యుమానిటీస్‌లో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. ఆమె భారతదేశం అంతటా ఏజెన్సీలు, బ్రాండ్‌లు, క్లయింట్‌లతో పనిచేసే ఫోటోగ్రాఫిక్ స్టూడియో, నిర్మాణ సంస్థ అయిన అటెలియర్ 11 అనే ఫోటోగ్రఫీ స్టూడియోకి సహ వ్యవస్థాపకురాలు (కో ఫౌండర్). సామాన్య ప్రజల జీవనశైలిని తన కెమెరాలో బంధించడంలో ఆమెది ప్రత్యేక శైలి. పలు ఆర్ట్ గ్యాలరీలలో తన ఫోటోలను ప్రద్శించారు. వెర్వ్ వంటి పాపులర్ మ్యాగజైన్లలో కూడా పని చేశారు.

మెథడ్ గ్యాలరీతో కలిసి ‘యు కెనాట్ మిస్ దిస్’ (2023), ఇండియా ఆర్ట్ ఫెయిర్ యంగ్ కలెక్టర్ ప్రోగ్రామ్‌లో భాగంగా ‘యు కెనాట్ మిస్ దిస్’ (2023), ది కోరమ్ క్లబ్‌లో ‘ది ఇల్యూజరీ వరల్డ్’ (2019), ఇండియా డిజైన్ ఐడి, కే2 ఇండియా (2018) వంటి ప్రదర్శనలలో తన ఫోటోలను ప్రదర్శించారు.

అవివా మీడియా కమ్యూనికేషన్ రంగాలలో వివిధ పాత్రలలో పని చేశారు. ప్లస్‌రిమ్న్‌లో ఫ్రీలాన్స్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ప్రోపగాండాలో జూనియర్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా సేవలందించారు. ఆర్ట్ చైన్ ఇండియాలో మార్కెటింగ్ ఇంటర్న్‌గా పని చేశారు. ఐ-పార్లమెంట్‌లోని ‘ది జర్నల్’కు ఎడిటర్-ఇన్-చీఫ్‌గా ఉన్నారు. వెర్వ్ మ్యాగజైన్ ఇండియా, క్రియేటివ్ ఇమేజ్ మ్యాగజైన్‌లో కూడా ఇంటర్న్‌షిప్‌లను పూర్తి చేశారు.