×
Ad

సర్‌ప్రైజ్‌.. గర్ల్‌ఫ్రెండ్‌ అవీవాతో ప్రియాంకా గాంధీ కుమారుడు రెహాన్‌ వాద్రాకు నిశ్చితార్థం

అవివా బేగ్‌తో రాయ్‌హాన్ వాద్రాకు దాదాపు ఏడేళ్లుగా పరిచయం ఉంది.

Raihan Vadra

Raihan Vadra: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కుమారుడు రెహాన్‌ వాద్రా(25)కు ఆయన గర్ల్‌ఫ్రెండ్‌ అవీవా బేగ్‌తో నిశ్చితార్థం జరిగింది. అవీవా బేగ్‌తో రెహాన్‌ వాద్రాకు దాదాపు ఏడేళ్లుగా పరిచయం ఉంది. రెహాన్ తన స్నేహితురాలు అవీవా బేగ్‌కు పెళ్లి ప్రతిపాదన చేయగా ఆమె అంగీకరించిందని జాతీయ మీడియా పేర్కొంది.

Vaikuntha Ekadashi: పండుగ వేళ ఎవరూ ఊహించనంతగా తగ్గిన బంగారం ధర.. వెండి ధర ఏకంగా రూ.23,000 తగ్గి..

ఈ నిశ్చితార్థానికి ఇరు కుటుంబాల ఆమోదం లభించినట్లు సమాచారం. అవీవా బేగ్, ఆమె కుటుంబం ఢిల్లీలో నివసిస్తోంది. రెహాన్ వాద్రా విజువల్‌ ఆర్టిస్ట్‌. వన్యప్రాణి, స్ట్రీట్, వాణిజ్య ఫొటోగ్రఫీలో పాల్గొంటుంటారు.

డెహ్రాడూన్‌లోని ది డూన్ స్కూల్‌లో రెహాన్ వాద్రా చదువుకున్నారు. గతంలో రాజీవ్ గాంధీతో పాటు రాహుల్ గాంధీ కూడా ఇక్కడే విద్యనభ్యసించారు. రెహాన్ వాద్రా పాలిటిక్స్‌లో లండన్‌లోని స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్‌లో ఉన్నత విద్యనభ్యసించారు.

అవీవా కూడా ఫొటోగ్రాఫర్‌, ప్రొడ్యూసర్‌. కాగా, ప్రియాంకా గాంధీ, రాబర్ట్ వాద్రా దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె. రెహాన్‌ వాద్రా నిశ్చితార్థంపై వారి కుటుంబం నుంచి అధికారికంగా ఇప్పటివరకు ప్రకటన రాలేదు.