UP 1st Govt Bus Women Driver : యూపీలో తొలి మహిళా బస్సు డ్రైవర్‌ ‘ప్రియాంక శర్మ’

ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ప్రియాంకా శర్మ రాష్ట్రంలో మొదటి ప్రభుత్వ బస్సు డ్రైవర్ గా నియామకమయ్యారు. యూపీ రోడ్డు రవాణా సంస్థ నియమించిన 26మంది మహిళా డ్రైవర్లలో ప్రియాంక శర్మ అనేక కష్టాలను అధిగమించి రాష్ట్రంలోనే మొదటి ప్రభుత్వ బస్సు డ్రైవర్ గా నిలిచారు.

UP first govt bus Women driver : భర్త మద్యానికి బానిసై మరణించినా..ఇతర చెడు అలవాట్లకు బానిసగా మారి కుటుంబాన్ని పట్టించుకోకపోయినా ఆ ప్రభావం పడేది ఇంటి మహిళపైనే. బాధ్యతలేని భర్త ఉన్న ప్రతీ భార్యా కుటుంబం కోసం ఏదోక పని చేసిన తన పిల్లలను పోషించుకుంటుంది. భర్త నిర్లక్ష్యంచేసినా ఆ బాధ్యత ఆమెపైనే పడుతుంది. అదే జరిగింది యూపీకి చెందిన ప్రియాంకా శర్మకు. భర్త మద్యానికి బానిస కావటంతో ఇద్దరి పిల్లల పోషణ భారం ఆమెపై పడింది. అలా కష్టపడి పిల్లలను పోషించుకుంటునే యూపీలో గవర్నమెంట్ బస్సు నడిపే తొలి మహిళా డ్రైవర్ గా ఘనత సాధించింది ప్రియాంకా శర్మ..

ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ప్రియాంకా శర్మ రాష్ట్రంలో మొదటి ప్రభుత్వ బస్సు డ్రైవర్ గా నియామకమయ్యారు. యూపీ రోడ్డు రవాణా సంస్థ నియమించిన 26మంది మహిళా డ్రైవర్లలో ప్రియాంక శర్మ అనేక కష్టాలను అధిగమించి రాష్ట్రంలోనే మొదటి ప్రభుత్వ బస్సు డ్రైవర్ గా నిలిచారు.

Sania Mirza India 1st Muslim Woman Fighter Pilot : ఫైటర్‌ పైలట్‌గా టీవీ మెకానికర్ కూతురు..వైమానిక దళ చరిత్రలో తొలి ముస్లిం యువతి ‘సానియా మీర్జా’ ఘనత

తాగుడుకు బానిసైన ప్రియాంక భర్త పైళ్లయిన కొంతకాలానికే మరణించాడు. దీంతో అప్పటికే పుట్టిన ఇద్దరు పిల్లల బాధ్యత ఆమెపై పడింది. ఇద్దరి పిల్లలను పోషించుకోవటానికి ఎన్నో పనులు చేసారు ప్రియాంక. పిల్లల కోసం రాష్ట్రమే దాటారు. ఢిల్లీకి వెళ్లి పడరాని పాట్లు పడ్డారు. కూలిపని చేయటానికి వెలనుకాడలేదు. దొరికిన పనల్లా చేసింది. అలా వచ్చిన అరాకొరా డబ్బులతో పిల్లలను పోషించుకునేవారు. అలా ఢిల్లీలో ఓ ఫ్యాక్టరీలో హెల్పర్ గా చేరింది. ఆ తరువాత ఫోర్ వీలర్ డ్రైవింగ్ నేర్చుకుంది.

డ్రైవింగ్ ట్రైనింగ్ కోసం ముంబయి, బెంగాల్, అస్సాం వంటి రాష్ట్రాలు తిరిగింది. డ్రైవింగ్ పై మంచి పట్టు సాధించారు ప్రియాంక. ఈక్రమంలో యూపీ ప్రభుత్వం బస్సుల్లో డ్రైవర్లుగా మహిళలకు అవకాశం కల్పించటంతో ప్రియాంక దృష్టి అటు పడింది. దాని కోసం 2020లో మహిళా డ్రైవర్ల కోసం రిలీజైన ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్నారు ప్రియాంక. ఇంటర్వ్యూలో విజయం సాధించారు. మే జరిగిన డ్రైవింగ్ పరీక్షలో కూడా పాస్ అయ్యారు. అలా గత సెప్టెంబర్ (2022) పోస్టింగ్ పొందారు. అలా ఓ సాధారణ గృహిణి నుంచి యూపీ రాష్ట్రంలోనే తొలి బస్సు మహిళా డ్రైవర్ గా పేరు సాధించారు.

 

ట్రెండింగ్ వార్తలు