Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ప్రియాంక కుమార్తె .. భారీగా పాల్గొన్న మహిళలు

రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర‌లో ప్రియాంక వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, వారి కుమార్తె మిరయా వాద్రా పాల్గొన్నారు. రాహుల్ గాంధీ మిరయా వాద్రా చేయి పట్టుకొని యాత్రలో ముందుకు సాగారు.

Bharat Jodo Yatra: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సోమవారం రాజస్థాన్‌లోని సహయ్ మాధోపూర్ జిల్లా పీపుల్వాడ ప్రాంతంలో సాగింది. ఉదయం 6గంటలకు ప్రారంభమైన యాత్ర 10గంటలకు పీపుల్వాడ వరకు సాగింది. సాయంత్రం 3.30 గంటలకు యాత్ర పున: ప్రారంభమైంది. అయితే మహిళా సశక్తికరణ్ దివస్ సందర్భంగా జోడో యాత్రలో రాహుల్ ఉదయం నుంచి మహిళలతో కలిసి నడిచారు. ఈ యాత్రలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా, ఆమె భర్త రాబర్డ్ వాద్రా, వారి కుమార్తె మిరయా వాద్రా పాల్గొన్నారు.

Bharat Jodo Yatra In rajasthan

ఈ సందర్భంగా మిరయా వాద్రా చేయి పట్టుకొని రాహుల్ తన పాదయాత్రను కొనసాగించారు. సోమవారం ఉదయం నుంచి మహిళలతో కలిసి రాహుల్ జోడోయాత్రలో పాల్గొని మహిళా సశక్తికరణ్ దివస్‌ను జరుపుకున్నాడు. రాహుల్ గాంధీ వెంట జోడోయాత్రలో ముందుకు సాగేందుకు మహిళలు పోటీ పడ్డారు. యాత్రలో మహిళలు సాంప్రదాయ రాజస్థానీ దుస్తులు ధరించి, జానపద పాటలు పాడుతూ ముందకు సాగారు. తెల్లవారు జాము నుంచి 4గంటల నుంచే రాహుల్ గాంధీని చూసేందుకు అతని వెంట పాదయాత్రలో ముందుకు సాగేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భారీ సంఖ్యలో పాల్గొన్న పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలతో జోడో యాత్ర పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి.

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీతో ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొన్నందుకు ప్రభుత్వ టీచర్‌ సస్పెన్షన్

ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, వారి కుమార్తె మిరయా వాద్రా ఉదయం బుండి టాంక్ జిల్లా సరిహద్దులో యాత్రలో చేరారు. వారికి స్థానిక కాంగ్రెస్ శ్రేణులు రాజస్థానీ శైలిలో స్వాగతం పలికారు. పాదయాత్రలో ప్రియాంక కుమార్తె ఆకర్షణగా నిలిచారు. మిరయా వాద్రా చేయి పట్టుకొని కొద్దిసేపు, ఆమె భుజంపై చేయివేసి కొద్దిసేపు రాహుల్ గాంధీ పాదయాత్రలో ముందుకు సాగారు. ఇందుకు సంబంధించిన పొటోలోు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 

 

ట్రెండింగ్ వార్తలు