Bharat Jodo Yatra: రాహుల్ గాంధీతో ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొన్నందుకు ప్రభుత్వ టీచర్‌ సస్పెన్షన్

బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో పాల్గొన్నందుకు ఓ ప్రభుత్వ టీచర్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. సెలవు కావాలని, ఓ ముఖ్యమైన పని ఉందని గిరిజన వ్యవహారాల శాఖకు చెందిన ఓ ప్రాథమిక పాఠశాల టీచర్ రాజేశ్ కన్నోజీ కోరారు. ఆయనకు సెలవు రావడంతో రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్రలో పాల్గొని ఫొటోలు తీసుకున్నారు. దీంతో ముఖ్యమైన పని అని చెప్పి, రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొంటావా? అంటూ అధికారులు ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీతో ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొన్నందుకు ప్రభుత్వ టీచర్‌ సస్పెన్షన్

bharat jodo yatra in madhya pradesh

Bharat Jodo Yatra: బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో పాల్గొన్నందుకు ఓ ప్రభుత్వ టీచర్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. నవంబరు 23 నుంచి మధ్యప్రదేశ్ లో రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభించారు. నవంబరు 24న ఆయన పాదయాత్ర బర్వానీ జిల్లాలో కొనసాగింది. అదే రోజున తనకు సెలవు కావాలని, ఓ ముఖ్యమైన పని ఉందని గిరిజన వ్యవహారాల శాఖకు చెందిన ఓ ప్రాథమిక పాఠశాల టీచర్ రాజేశ్ కన్నోజీ కోరారు.

ఆయనకు సెలవు రావడంతో రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొని ఫొటోలు తీసుకున్నారు. దీంతో ముఖ్యమైన పని అని చెప్పి, రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొంటావా? అంటూ అధికారులు ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. ‘‘ఉపాధ్యాయ సేవల నియమావళిని ఉల్లంఘించి రాజకీయ ర్యాలీలో పాల్గొన్నందుకు కన్నోజీని సస్పెండ్ చేశాము. ముఖ్యమైన పని ఉందని ఆయన చెప్పారు. కానీ, రాజకీయ కార్యక్రమంలో ఆయన పాల్గొని, ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు’’ అని గిరిజన వ్యవహారాల శాఖ సహాయ కమిషనరు ఎన్ఎస్ రఘువంశీ వివరించారు.

దీనిపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. తమ పార్టీ నేత రాహుల్ మాత్రం రాజకీయాలకు సంబంధం లేకుండా పాదయాత్ర చేస్తుంటే, అందులో పాల్గొన్న టీచర్ ను సస్పెండ్ చేయడం ఏంటని కాంగ్రెస్ మధ్యప్రదేశ్ మీడియా విభాగ చైర్‌పర్సన్ కేకే మిశ్రా ట్విట్టర్ లో ప్రశ్నించారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..