PUC Certificates : PUC సర్టిఫికెట్‌ లేదా? రూ.10వేలు జరిమానా.. 6 నెలల జైలుశిక్ష!

వాయు కాలుష్యాన్ని నిర్మూలించేందుకు ఢిల్లీ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పీయూసీ (PUC) సర్టిఫికేట్ లేకుండా వాహనం నడిపితే జైలుశిక్ష విధించనుంది.

PUC certificates : దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. వాయు కాలుష్యాన్ని నిర్మూలించేందుకు ఢిల్లీ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పీయూసీ (PUC) సర్టిఫికేట్ లేకుండా వాహనాన్ని నడిపితే రూ.10వేల జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్ష విధించనుంది. అందుకే డ్రైవింగ్‌ సమయంలో ప్రతి వాహనం తప్పనిసరిగా పొల్యూషన్‌ అండర్‌ కంట్రోల్‌ (PUC) సర్టిఫికెట్‌ వెంట తెచ్చుకోవాలని ఢిల్లీ ప్రభుత్వం పబ్లిక్‌ నోటీస్‌ జారీ చేసింది. ఒకవేళ PUC సర్టిఫికెట్‌ సమర్పించడంలో విఫలమైతే ఆరు నెలల జైలుశిక్ష, రూ.10వేల జరిమానా.. లేదా రెండూ విధించే అవకాశం ఉంటుందని ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరించింది.
Read Also : Australia : కోవాగ్జిన్ టీకాకు గుర్తింపు.. ఆంక్షలు ఎత్తేసిన ఆస్ట్రేలియా!

అంతేకాదు.. పీయూసీ సర్టిఫికెట్‌ చూపించని వాహనాల డ్రైవర్ల లైసెన్స్‌ను కూడా 3 నెలల పాటు రద్దు చేస్తామని నోటీస్‌లో పేర్కొంది. సెంట్రల్‌ మోటార్‌ వెహికల్‌ రూల్స్‌ 1989 ప్రకారం.. ప్రతి వాహనానికి (BS-I/BS-II/BS-III/BS-IV), CNG/LPG సహా వ్యాలిడ్ సర్టిఫికెట్‌ ఉండాల్సిందేనని వెల్లడించింది. వాహనదారులు తమ వాహనం నుంచి వెలవబడే కాలుష్యాన్ని చెకింగ్ చేసుకోవాలని సూచించింది. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైయాక్సైడ్ ఉద్గారాల స్థాయి ఎంత ఉందో చెక్ చేసుకోవాలని సూచించింది.

అప్పుడు వారికి అందించే PUC సర్టిఫికెట్ వెంట ఉంచుకోవాలని తెలిపింది. పెట్రోల్, CNG పవర్ టూవీలర్, త్రి వీలర్ వాహనదారులు కేవలం రూ.60 చెల్లించి పీయూసీ టెస్టింగ్ చేయించుకోవచ్చు. ఫోర్ వీలర్ వాహనదారులు రూ.80 వరకు చెల్లించి పొల్యుషన్ చెకింగ్ చేసుకోవచ్చు. అదే డీజిల్ వాహనాలకు అయితే రూ.100 చెల్లించి పీయూసీ టెస్టు చేయించుకుని సర్టిఫికెట్ పొందవచ్చు. అదే ఫోర్ వీలర్ BS-1V కంప్లయింట్ వెహికల్ కు పీయూసీ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఏడాదివరకు ఉంటుంది. ఇతర వాహనాలకు మూడు నెలలు మాత్రమే ఉంటుంది.
Read Also : India 31 Children Die : ప్రతిరోజూ 31మంది చిన్నారుల ఆత్మహత్య! : NCRB రిపోర్టు 

ట్రెండింగ్ వార్తలు