పుల్వామా ఉగ్రదాడి జరిగిన నెల రోజులు పూర్తికాకుండానే మరో ఘటన కలకలం రేపింది. పుల్వామా జిల్లాలో 25ఏళ్ల సైనికుడిని గన్‌తో షూట్ చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పింగ్లీనా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆషిక్ హుస్సేన్ అనే సైనికుడు జమ్మూ కశ్మీర్ లైట్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్ డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వర్తిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి మాస్క్‌తో వచ్చి షూట్ చేశాడు.
Read Also : గెలుపోటముల్లో 5శాతం ఇంపాక్ట్ : అభ్యర్థుల రాతను డిసైడ్ చేస్తున్న సోషల్ మీడియా
పింగ్లీనా గ్రామంలోని నాయక్ మొహల్లా సైనికుడి ఇంటి ముందే ఘటన జరగడంతో సైనికులు ఇంటికి కూడా భద్రత కరువైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన జరిగిన కొద్ది క్షణాల్లోనే ఆర్మీ ప్రత్యేక బలగాలు అక్కడికి చేరుకున్నాడు. హంతకుల గురించి సెర్చ్ చేసిన అధికారులు ఆ ప్రాంతం మొత్తం ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు.
ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడి అనంతరం కశ్మీర్ మొత్తం భయాందోళనలో కాలం వెల్లదీస్తోంది. జవాన్లు ప్రయాణించడానికి కూడా భద్రత లేకుండా తయారైంది అక్కడ పరిస్థితి.