ఈ రోజుల్లో ఒక్కసారి ఉద్యోగం సంపాదించటం ఎంత కష్టమో తెలిసిన విషయమే. ఇంకా చెప్పాలంటే నాలుగు ఇళ్లల్లో హోం మెయిడ్ గా పనిచేసేవారి గురించి చెప్పనక్కరలేదు. వారి ఆదాయం ,ఉద్యోగం అంతా యజమానులపై ఆధారపడి ఉంటుంది. కఠిన వైఖరి కలిగిన యజమానులు తక్కువ జీతానికి వారితో పని చేయించుకోవాలనుకుంటారు. అంటువంటి వారిని జీతం పెంచమంటే పనిలో నుంచి తీసేస్తామని బెదిరిస్తారు. దీంతో వేరొక చోట పని దోరక ఎంతో బాధ పడుతుంటారు.
అయితే పూణేకు చెందిన దనశ్రీ షిండే అనే ఓ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ మాత్రం తన ఇంట్లో పనిచేసే మహిళకు ఇలాంటి పరిస్థితి రానివ్వకుండా ఒక కొత్త ఆలోచనతో బిజినేస్ కార్డును ఏర్పాటు చేసింది. మార్కెటింగ్ రంగంలో తనకున్న అనుభవాన్ని ఉపయోగించి ఆమెకు ఓ బిజినెస్ కార్డు తయారు చేసి, ఆమెకు చేతినిండా పనిదొరికేలా చేసింది.
ధనశ్రీ ఓ రోజు ఇంటికి వచ్చే సమయానికి ఆమె పనిమనిషి గీతా కాలే బాధపడుతూ ఉండటంతొ ఏమైందని ధనశ్రీ ఆమెను అడిగింది.తను ఓ పచి చేసే ఓ చోట తనను తొలగించారని గీతాయ కాలే ఏడుస్తూ చెప్పింది. నెలకు 4000 రూపాయల ఆదాయం కోల్పోవాల్సి వచ్చిందని ధనశ్రీకి చెప్పింది. దీంతో ధనశ్రీకి ఓ ఆలోచన వచ్చింది. అంట్లు తోమడానికి నెలకు రూ. 800, ఇల్లు ఊడ్వటానికి రూ. 800,బట్టలు ఉతకడానికి రూ. 800, రొట్టెలు చేసేందుకు 1000 రూపాయలు. ఇక ఇల్లు శుభ్రం చేయడం, కూరగాయలు తరగడం వంటి పనులు ఉచితం. ఆధార్ కార్డు కూడా వెరిఫై చేయబడింది అంటూ గీతా కాలే పేరిట ఓ బిజినెస్ కార్డు తయారుచేసింది. ఆ కార్డ్ ను అస్మితా ఓ మహిళ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఆ పోస్ట్ వైరల్ గా మారింది.అప్పటినుంచి గీతా కాలేకు వందల సంఖ్యలో ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. గీతా సేవలను వినియోగించుకునేందుకు బద్వాన్ వాసులు ముందుకు వస్తున్నారు.