Punjab AAP CM : ఏడేళ్లుగా ఎంపీ.. అయినా అద్దింట్లోనే, నిజాయితీ సీఎం రావడం అవసరం

ఆయన ఏడు సంవత్సరాలుగా ఎంపీగా కొనసాగుతున్నా... అత్యంత సాధారణ జీవితం గడుపుతున్నారని ప్రశంసించారు. అంతేగాకుండా.. ఇంకా అద్దెంటిలోనే నివాసం ఉంటున్నారని.. ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రానికి...

MP Bhagwant Mann : ఎవరైనా ఎమ్మెల్యే, ఎంపీ అయితే చాలు.. మూడు నాలుగు అంతస్తుల భవనాలు, కార్లు ఉంటాయి.. కానీ తమ పార్టీకి చెందిన వ్యక్తి.. సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ కు అలాంటివి ఏమీ లేదన్నారు ఆప్ వ్యవస్థాకులు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ఆయన ఏడు సంవత్సరాలుగా ఎంపీగా కొనసాగుతున్నా… అత్యంత సాధారణ జీవితం గడుపుతున్నారని ప్రశంసించారు. అంతేగాకుండా.. ఇంకా అద్దెంటిలోనే నివాసం ఉంటున్నారని.. ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రానికి నిజాయితీ కలిగిన ముఖ్యమంత్రి రావడం అత్యంత అవసరమనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read More : AP Corona Cases : ఏపీలో కొత్తగా 12,561 కరోనా కేసులు, 12 మరణాలు

పంజాబ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇక్కడ అధికారంలోకి రావాలని కాంగ్రెస్, బీజేపీ, ఆప్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఢిల్లీకే పరిమితం కాకుండా..చిన్న చిన్న రాష్ట్రాల వైపు ఫోకస్ పెట్టిన ఆప్.. పంజాబ్ రాష్ట్రంలో పోటీలోకి బరిలోకి దిగింది. వినూత్నంగా ప్రచారం చేపడుతోంది. 2022, జనవరి 28వ తేదీ శుక్రవారం చండీగడ్ లో కేజ్రీవాల్ పర్యటించారు. సంగ్రూర్ ఎంపీ, ప్రస్తుత ఎన్నికల్లో సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ కు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్.. విపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు.

Read More : UP Election 2022 : నా హెలికాప్టర్‌‌ను ఎందుకు అనుమతించలేదు.. కుట్ర దాగి ఉంది

ఇతర రాజకీయ పార్టీల నేతల్లాగా పెద్ద పెద్ద భవంతులు, కార్లు భగవంత్ మాన్ కు లేవన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 26 ఏళ్ల పాటు దోచుకొంటే.. బాదల్ కుటుంబం 19 ఏళ్ల పాటు దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. ఇతర పార్టీలకు చెందిన నేతలు ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్నారని కానీ… ఎవరి నుంచి పైసా కూడా తీసుకోని భగవంత్ మాన్ ఎన్నికల బరిలో నిలుస్తున్నాడన్నారు. తమ పార్టీకి పట్టం కడితే…అవినీతి రహిత పాలన అందిస్తామని మరోసారి కేజ్రీవాల్ ప్రజలకు హామీనిచ్చారు. ఫిబ్ర‌వ‌రి 14వ తేదీన జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఫిబ్ర‌వ‌రి 14న జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 20కు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. పంజాబ్ రాష్ట్రంలో 117 సీట్లు ఉండగా…ఫిబ్రవరి 14వ తేదీన పోలింగ్ జరుగనుంది.

ట్రెండింగ్ వార్తలు