AP Corona Cases : ఏపీలో కొత్తగా 12,561 కరోనా కేసులు, 12 మరణాలు
ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు కరోనా మరణాల సంఖ్య పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది.

Ap Corona Cases
AP Corona Cases : ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు కరోనా మరణాల సంఖ్య పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 12వేల 561 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 12 మంది కోవిడ్ తో చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 8వేల 742 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఒక లక్ష 13వేల 300 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Alien Planets: “5,000 గ్రహాల్లో ఏలియన్స్”?.. అమెరికా అంతరిక్ష పరిశోధకుల వింత వాదన
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 40వేల 635 మందికి కరోనా పరీక్షలు చేశారు. తాజాగా నమోదైన కేసుల్లో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 1,710 కరోనా కేసులు వెలుగుచూశాయి. గుంటూరు జిల్లాలో 1,625.. కడప జిల్లాలో 1,215.. విశాఖ జిల్లాలో 1,211.. తూర్పుగోదావరి జిల్లాలో 1,067 కరోనా కేసులు బయటపడ్డాయి.
Type-2 Diabetes: డిన్నర్ లేటవుతుందా.. షుగర్ పెరుగుతుందన్న మాటే..
గడిచిన 24 గంటల్లో విశాఖపట్నంలో ముగ్గురు కరోనాతో చనిపోయారు. కర్నూలు జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు కోవిడ్ తో మరణించారు. అనంతపురం, చిత్తూరు, గుంటూరు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో ప్రాణాలు వదిలారు. రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14,591కి పెరిగింది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,48,608కి చేరింది. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 21,20,717గా ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 3,23,65,775 కరోనా టెస్టులు చేశారు.
కాగా నిన్న 13వేల 474 కరోనా కేసులు, 9 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. నిన్నటి పోలిస్తే ఇవాళ కొత్త కేసుల సంఖ్య తగ్గినా.. మరణాల సంఖ్య పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది.
#COVIDUpdates: 28/01/2022, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 22,45,713 పాజిటివ్ కేసు లకు గాను
*21,17,822 మంది డిశ్చార్జ్ కాగా
*14,591 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,13,300#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/TpdJX1qJNz— ArogyaAndhra (@ArogyaAndhra) January 28, 2022