Alien Planets: “5,000 గ్రహాల్లో ఏలియన్స్”?.. అమెరికా అంతరిక్ష పరిశోధకుల వింత వాదన
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5,000 గ్రహాల్లో ఏలియన్స్ ఉండే అవకాశం ఉందంటూ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ "నాసా" ఇటీవల ప్రకటించింది.

Alien Planets: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5,000 గ్రహాల్లో ఏలియన్స్ ఉండే అవకాశం ఉందంటూ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ “నాసా” ఇటీవల ప్రకటించింది. అంతరిక్ష పరిశోధనలో బాహ్య గ్రహాలను వెతికేందుకు తాము పరిక్షించిన ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ (TESS) ద్వారా ఈ విషయం వెల్లడైందంటూ నాసా పేర్కొంది. సౌర కుటుంబంలో ఇతర గ్రహాల అన్వేషణ, వాటిపై గ్రహాంతర వాసుల ఆనవాళ్లను కనిపెట్టేందుకు ఏప్రిల్ 2018లో నాసా ఈ TESS శాటిలైట్ ను ప్రయోగించింది. ఆనాటి నుంచి 5,000 గ్రహాలను పోలిన ఖగోళ వస్తువులను గుర్తించిన ఈ ఉపగ్రహం.. వాటిలో 176 వస్తువులను గ్రహాలుగా నిర్ధారించింది. ఒక్క 2021 ఏడాదిలోనే.. 2400 గ్రహాలను పోలిన ఖగోళ వస్తువులను ఈ TESS గుర్తించిందని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)కి చెందిన పరిశోధకురాలు మిచెల్ కునిమోటో తెలిపారు.
Also read: India – Pak Border: భారత్ పాక్ సరిహద్దుల్లో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్
ఇక TESS గుర్తించిన 5,000 బాహ్యగ్రహాల్లో ఏలియన్స్ జాడలు ఉండే ఉంటాయని అమెరికాలోని అంతరిక్ష పరిశోధకులు వాదిస్తున్నారు. ఆయా గ్రహాలు ఏర్పడిన తీరు, ప్రస్తుతం ఉన్న తీరు, వాటిపై ఉన్న వాతావరణాలను అంచనా వేసి ఈ నిర్ణయానికి వచ్చారు. TESS ఉపగ్రహం.. ఖగోళ వస్తువును కనిపెట్టి.. దాన్ని గ్రహంగా గుర్తించేందుకు కొంత సమయం పడుతుండడంతో ఆయా వస్తువుల వాతావరణాన్ని అంచనా వేసేందుకు ఆలస్యం అవుతుంది. ఇక TESS కంటే ముందు బాహ్యగ్రహాల పరిశోధనకు ప్రయోగించిన కెప్లెర్ టెలిస్కోప్.. 2000 ఖగోళ వస్తువులను కనుగొన్నా.. అవేవి.. గ్రహాలుగా నిర్ధారింపబడలేదు. TESS కనిపెట్టిన ఒక గ్రహంపై ఏడాది కాలం.. భూమిపై 16 గంటలకే ముగుస్తున్నట్లు ఈ ప్రాజెక్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పరిశోధకురాలు మిచెల్ కునిమోటో తెలిపారు.
Also read: TS High Court: తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ హాజరైన డీహెచ్
దీంతో TESS పనితీరుపై అంతరిక్ష పరిశోధకులకు నమ్మకం కుదిరింది. అందుకే రెండు సంవత్సరాల పని నిమిత్తం అంతరిక్షంలోకి పంపిన TESS శాటిలైట్ సేవలను మరో మూడేళ్ళ పాటు(2025 వరకు) వినియోయోగించుకోవాలని నాసా పరిశోధకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు కనిపెట్టిన గ్రహాలలో ఏలియన్స్ ఉండే అవకాశాం ఉందని మాత్రమే అంచనా వేశామని.. కానీ నిర్ధారణ చేయలేదని మిచెల్ కునిమోటో తెలిపారు.
Also read: AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై సందిగ్థత?
- Australia – India: ఆస్ట్రేలియాలో మారిన ప్రభుత్వం: భారత్కు లాభమా? నష్టమా?
- Taliban Bans Polygamy: బహుభార్యత్వంపై నిషేధం విధించిన తాలిబన్లు
- PM Birth Date Change: కలిసి రావడంలేదని పుట్టిన తేదీని మార్చుకుంటున్న ఆ దేశ ప్రధాని
- Sri Lanka Crisis: చైనా పంపిణీ చేసిన రేషన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీలంక అధికారులు
- Indonesia Bus Crash: బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో 15 మంది మృతి..16 మందికి తీవ్ర గాయాలు
1Texas shooting: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి
2PM Modi Bhimavaram Tour : రేపు భీమవరంలో ప్రధాని మోదీ పర్యటన.. షెడ్యూల్ ఖరారు
3bjp: కేసీఆర్ పాలన పోయి, బీజేపీ పాలన రావడం ఖాయమైంది: జేపీ నడ్డా
4PM Narendra Modi : తెలంగాణలో మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మిస్తాం-నరేంద్ర మోదీ
5IndvsEng 5thTest : 284 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్.. భారత్కు భారీ లీడ్
6Burglar : దొంగతనానికి వచ్చి ఇంట్లో మంచం కింద నిద్రపోయిన దొంగ
7bjp: డబుల్ ఇంజన్ ప్రభుత్వం కోసం తెలంగాణ ప్రజలు పట్టాలు వేస్తున్నారు: మోదీ
8Bairstow Century : భారత్ ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్.. బెయిర్ స్టో సెంచరీ
9bjp: అందుకే తెలంగాణలో బీజేపీ సర్కారు రావాలి: బండి సంజయ్
10Operation Dakshin : ఆపరేషన్ దక్షిణ్ మొదలెట్టనున్న బీజేపీ-కర్ణాటక సీఎం బొమ్మై
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!
-
Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!
-
Probiotics : రోగనిరోధక శక్తికి మేలు చేసే ప్రొబయోటిక్స్!
-
Potatoes : రక్తంలో కొలొస్ట్రాల్ స్ధాయిలను తగ్గించే బంగాళ దుంప!
-
Monkeypox : రూపం మార్చుకున్న మంకీపాక్స్..బ్రిటన్లోని రోగుల్లో వేరే లక్షణాలు
-
Kurnool : ఆస్తి కోసం పిన్నమ్మనే హత్య చేశారు