Punjab Polls: నేడే పంజాబ్ ఎన్నికలు.. ఉదయం 7 గంటలకే ప్రారంభం

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పంజాబ్‌లో నేడు (ఫిబ్రవరి 20) పోలింగ్‌ జరగబోతోంది. పంజాబ్ తో పాటు ఉత్తరాఖండ్ లోనూ..

Punjab Polls: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పంజాబ్‌లో నేడు (ఫిబ్రవరి 20) పోలింగ్‌ జరగబోతోంది. పంజాబ్ తో పాటు ఉత్తరాఖండ్ లోనూ ఒకే విడతలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుండగా.. పంజాబ్ లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలలో 2 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు 1304 మంది అభ్యర్థుల ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.

పంజాబ్ లో ప్రదానంగా కాంగ్రెస్, ఏఏపీ, బీజేపీ, శిరోమణి అకాలీదళ్-బీఎస్పీ మధ్య చతుర్ముఖ పోటీ నెలకొనగా.. మాజీ సీఎం అమరీందర్ సింగ్ స్థాపించిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ కీ రోల్ పోషించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ చివరి క్షణాల వరకు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించగా.. దాదాపు ప్రధాన పార్టీలన్నీ పంజాబ్ ప్రజలపై హామీల వర్షం కురిపించాయి.

అయితే.. ఢిల్లీలో ఏడాదికిపైగా సాగిన రైతు ఉద్యమం కారణంగా నూతన వ్యవసాయ చట్టాల రద్దు జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ అంశం పంజాబ్ రాష్ట్ర ఎన్నికల అంశంగానూ మారి హోరెత్తింది. కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్షాలు దేశంలో అధికార పార్టీ బీజేపీని టార్గెట్ చేస్తే.. ప్రధాని నుండీ బడా నేతల వరకు పంజాబ్ లో దిగిపోయి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. మరి ఇక పంజాబ్ ఓటర్ల నిర్ణయం ఏంటన్నది చూడాలి.

ట్రెండింగ్ వార్తలు