Punjab Home: రైల్వే ప్రాజెక్టులో పోతున్న ఇల్లు.. కూల్చకుండా 500 అడుగులు పక్కకు జరుపుతున్న యజమాని

రైల్వే ప్రాజెక్టు కోసం ఇంటిని కోల్పోవడానికి ఇష్టపడని ఒక రైతు.. ఇంటిని ప్రాజెక్టుకు దూరంగా జరుపుకుంటున్నాడు. కొత్త టెక్నాలజీ ద్వారా ఇంటిని 500 అడుగుల దూరం జరిపి, తన ఇంటిని సురక్షితంగా కాపాడుకుంటున్నాడు.

Punjab Home: రోడ్ల విస్తరణ, రైల్వే ప్రాజెక్టుల కోసం కొన్నిసార్లు ఇండ్లను కూల్చాల్సి వస్తుందనే సంగతి తెలిసిందే. కొన్నిసార్లు పాక్షికంగా ఇండ్లను కూలిస్తే.. ఇంకొన్నిసార్లు పూర్తిగా ఇండ్లను కూల్చేస్తారు. రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం నష్ట పరిహారం కూడా అందిస్తుంది. అయితే, పరిహారం వచ్చినప్పటికీ చాలా మందికి ఇండ్లను కూల్చుకోవడం ఇష్టముండదు. ఎందుకంటే ఇళ్లను ఎంతో కష్టపడి, ఇష్టంతో కట్టుకుంటారు. ఇంటితో ఒక అనుబంధం ఉంటుంది.

Boycott Amazon: అభ్యంతరకర కృష్ణుడి చిత్రాలు అమ్ముతున్న అమెజాన్.. బాయ్‌కాట్ చేస్తామంటున్న నెటిజన్స్

అలాంటి ఇంటిని కోల్పోవాలంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. అలా ఇంటిని కోల్పోవడానికి ఇష్టపడని ఒక రైతు.. తన ఇంటిని కూల్చడానికి బదులు.. 500 అడుగులు పక్కకు జరపాలని నిర్ణయించుకున్నాడు. పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాలోని రోషన్ వాలా గ్రామానికి చెందిన సుఖ్వీందర్ సింగ్ సుఖి అనే రైతు తన పొలంలోనే ఇల్లు కట్టుకున్నాడు. అయితే, ఈ పొలంలోంచి రైల్వే ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. ఢిల్లీ-అమృత్‌సర్-కత్రా ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం సుఖ్వీందర్ సింగ్ పొలంలోంచి వెళ్తుంది. దీనిలో భాగంగా అతడి ఇళ్లు కూడా పోతుంది. అధికారులు ఇంటికి పరిహారం కూడా చెల్లిస్తామని చెప్పారు. అయితే, అతడు ఆ ఇంటిని ఎంతో ఇష్టంతో, తనకు నచ్చినట్లుగా నిర్మించుకున్నాడు.

Madhya Pradesh: తలపై గాయం.. కండోమ్ ప్యాకెట్‌తో కట్టు కట్టిన వైద్య సిబ్బంది

దీనికి కోటిన్నర రూపాయలు ఖర్చైంది. అలాంటి ఇంటిని రైల్వే ప్రాజెక్టు కోసం కోల్పోవడానికి సుఖ్వీందర్ ఇష్టపడలేదు. ఎలాగైనా ఇంటిని కాపాడుకోవాలనుకున్నాడు. ఇందుకోసం ఒక కొత్త పద్ధతి పాటించాడు. లేటెస్ట్‌గా అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ ద్వారా ఇంటిని సురక్షితంగా పక్కకు జరుపుకోవాలనుకున్నాడు. దాదాపు 500 అడుగుల దూరం ఇంటిని జరిపితే, ఆ ఇల్లు సురక్షితంగా ఉంటుందని గుర్తించాడు. దీనికి సంబంధించి ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పటికే ఇంటిని 250 అడుగుల దూరం జరిపారు. మరో 250 అడుగులు జరిపితే చాలు. ఆ ఇల్లు సురక్షితంగా ఉంటుంది.