Punjab-Ludhiana National Highway Incident
Road Accident : ఢిల్లీలో వాతావరణ కాలుష్య, వాయు కాలుష్యం కలవరానికి గురి చేస్తోంది. శీతాకాలం పెరుగుతున్న కొద్దీ గాలి నాణ్యత అత్యంత దారుణంగా పడిపోతుంది. దీపావళి తర్వాత ఢిల్లీ సహా చుట్టు పక్కల ప్రాంతాలు కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవల్లాడుతున్నాయి. ప్రజలు ఊపిరి తీసుకునే పరిస్థితి లేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తల్లవారుజామున పరిస్థితి మరింత ఘోరంగా మారుతోంది. విజిబులిటీ లేక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పంజాబ్ లోనే ఢిల్లీ తరహా పరిస్థితులే కనిపిస్తున్నాయి.
లుథియానాలో ఇవాళ తెల్లవారుజామున పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. హైవేపై పదుల సంఖ్యలో వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. పొగమంచుకు తోడు వాయు కాలుష్యం పెరుగడంతో ముందున్న వాహనాలు సరిగ్గా కనిపించలేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో నేషనల్ హైవేపై చిన్న ప్రమాదం పదుల సంఖ్యలో వాహనాల యాక్సిడెంట్ కు కారణమైంది. ఈ ప్రమాదంలో ట్రక్కులు, లారీలతోపాటు కార్లు ధ్వంసం అయ్యాయి.
Man Burnt Alive : హైదరాబాద్ ఓఆర్ఆర్ పై కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం
పదుల సంఖ్యలో వాహనాలు వరుసగా నిలిచిపోవడంతో నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు డ్యామేజ్ అయిన వాహనాలను తొలగించడంతోపాటు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తున్నారు. ఢిల్లీ నగరం నలుమూలల పొంగమంచుతోపాటు వాయు కాలుష్యం కమ్ముకుంది. దీంతో ఉదయాన్నే వాకింగ్ చేసే ప్రజలు బయటికి రావాలంటేనే వణికిపోతున్నారు.