బాత్రూంలో స్పై కెమెరాలతో ఫొటోలు తీసి భార్యనే బ్లాక్‌మెయిల్

బాత్రూంలో స్పై కెమెరాలతో ఫొటోలు తీసి భార్యనే బ్లాక్‌మెయిల్

Updated On : November 7, 2020 / 11:47 AM IST

Blackmail: పంజాబ్‌లోని లూధియానలో భార్యనే బ్లాక్‌మెయిల్ చేశాడు. స్పై కెమెరాలతో బాత్రూంలో ఫొటోలు తీశాడు. ఆ తర్వాత వాటితో టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. పుట్టింట్లోనే ఉంటున్న భార్యకు తెలియకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. బాత్రూంలో ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండానే ఫొటోలు తీశాడు. ఈ ఫొటోలు పంపించి రూ.20లక్షలు డిమాండ్ చేశాడు. అంత డబ్బు ఇవ్వలేకపోతే ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు.

అందులో కొన్ని ఫొటోలను తన భర్త ఆల్రెడీ వాట్సప్ స్టేటస్ కింద పోస్టు చేశాడని మహిళ చెప్పింది. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ గుర్దేవ్ సింగ్ మాట్లాడుతూ.. ఈ క్రైమ్ లో ఆమె భర్తతో పాటు అత్త, మామలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని వాపోయింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐటీ యాక్ట్, సెక్షన్స్ 67, 67-ఏ ప్రకారం.. కేసు ఫైల్ చేశారు. విచారణ తర్వాత ఎఫ్ఐఆర్ లో పేర్లు ఎంటర్ చేసినట్లు ఏఎస్ఐ చెప్పారు.



మరో ఘటనలో:
మహారాష్ట్రలో జరిగిన మరో ఘటనలోనూ ఇలాగే జరిగింది. భార్య.. లవర్‌తో ఉన్నప్పటి వీడియో చూసిన భర్త ఆమెను హత్య చేశాడు. నిందితుడ్ని రఫిక్ మొహమ్మద్ యూనస్(50)గా గుర్తించారు. వైరల్ గా మారిన ఆ వీడియో చూసి భార్య సోదరి ఇంటి వద్దనే కత్తితో పొడిచాడు. ఆ తర్వాత రక్తం కారుతున్న కత్తిని తీసుకుని శాంతినగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.
https://10tv.in/blackmail-girls-married-woman-in-vikarabad/
భార్య న్యూడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో సిగ్గుపడిన భర్త.. మర్డర్ చేశాడని అతనిపై సెక్షన్ 302 ప్రకారం కేసు ఫైల్ చేశారు.