అమృత్‌సర్ లో పవిత్ర గ్రంథం శ్రీ గురు గ్రంథ్ సాహిబ్‌ను స్థాపించిన 415 వ వార్షికోత్సవాన్ని పంజాబ్‌లోని అమృత్సర్‌లో ప్రజలు శనివారం (ఆగస్టు 31)న అత్యంత ఉత్సాహంతో జరుపుకున్నారు. ఈ ఊరేగింపులో కత్తులతో చిన్నారులు చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
‘ప్రకాష్ పర్వ్’ సందర్భంగా..రామ్‌సర్ గురుద్వారా వెలుపల భారీ ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపులో చిన్నారులు, పురుషులు సంప్రదాయ నీలిరంగు దుస్తులు ..నీలిరంగు తలపాగాలు ధరించి పాల్గొన్నారు. చిన్నారులు సైతం ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. తెల్లటి దుస్తులు వేసుకున్న చిన్నారులు కూడా నీలిరంగు తలపాగా ధరించి సందడి చేశారు. పెద్దవారితో సమానంగా కరవాలను మెరుపు వేగంతో తిప్పి అలరించారు.
పెద్దవారితో కత్తి దూశారు. కత్తులను వాయివేగంతో తిప్పి విన్యాసాలు చేశారు. ప్రజలు కవాతు చేశారు. ఈ ఊరేగింపులో చిన్నారుల ప్రతిభ అందరినీ అబ్బురపరిచింది. ఈ వేడుకలను పంజాబ్‌లో ప్రతిచోటా జరుపుకుంటారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ..సిక్కు గురువులు గురు గ్రంథ్ సాహిబ్‌ను సంకలనం చేసే భారీ ప్రాజెక్టును సిక్కుల ఐదవ గురువు గురు అర్జన్ దేవ్ చేపట్టారు.