puppies charred to death in fire: మధ్యప్రదేశ్‌లోని మందసర్‌లో ఓ గుర్తుతెలియని అతి కిరాతకంగా వ్యవహరించాడు. 9 కుక్క పిల్లలను అత్యంత దారుణంగా చంపాడు. అంతేకాదు వాటికి నిప్పంటించాడు. ఈ ఘటన సంచలనంగా మారింది. జంతు ప్రేమికులను తీవ్రంగా బాధించింది. ఈ విషయం పెటా(పీపుల్ ఆఫ్ ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ ఆనిమల్స్) వరకు చేరింది. వారు వెంటనే స్పందించారు.
కుక్క పిల్లలను కిరాతకంగా చంపిన గుర్తుతెలియని వ్యక్తిపై చర్యలు చేపట్టేందుకు పెటా ప్రయత్నాలు చేస్తోంది. నిందితుడి సమాచారం అందించిన వారికి రూ.50 వేల రివార్డు ప్రకటించింది. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామంది. అంతేకాదు పెటా.. పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు 429 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితుడి గురించి ఎలాంటి సమాచారం లభించ లేదు. ఈ నేపథ్యంలోనే అతడి వివరాలు తెలియజేస్తే రూ.50 వేల రివార్డు అందిస్తామని పెటా ప్రకటించింది.
కొన్ని రోజుల క్రితం కొందరు వ్యక్తులు తమ ఇళ్ల పక్కన ఉండే ఖాళీ స్థలంలో కంప చెట్లను, ముళ్ల పొదలను తొలగించేందుకు వాటికి నిప్పు పెట్టారు. పొదల నుంచి పాములు, జంతువులు తమ ఇళ్లలోకి వస్తున్నాయని వాళ్లు ఈ పని చేశారు. కాగా, అదే సమయంలో పొదల్లో కుక్క పిల్లలు కూడా ఉన్నాయని, ఆ మంటల్లో అవి చనిపోయాయని స్థానికులు చెబుతున్నారు.