రాహుల్ కు కోర్టు ధిక్కరణ నోటీసు

లోక్ సభ ఎన్నికల ప్రచార సందర్భంగా ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ చౌకీదార్‌ చోర్‌ హై అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ‘చౌకీదార్‌ చోర్‌ హై’ అనే పద ప్రయోగ విషయంలో సుప్రీంకోర్టు మంగళవారం(ఏప్రిల్-23,2019)  రాహుల్‌ గాంధీకి కోర్టు ధిక్కరణ నోటీసులిచ్చింది. వచ్చే మంగళవారం లోపల దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

చౌకీదార్‌ చోర్‌ అనే పద ప్రయోగంపై సోమవారం రాహుల్‌ గాంధీ దాఖలు చేసిన అఫిడవిట్‌ లో ఎక్కడా ఆయన క్షమాపణలు కోరలేదని, కేవలం చౌకీదార్‌ చోర్‌ అనే వ్యాఖ్యలను సుప్రీం తీర్పునకు ఆపాదించానని మాత్రమే ఒప్పుకున్నారని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు.రాహుల్‌ తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్న పదాన్ని బ్రాకెట్‌ లో పెట్టారని తెలిపారు.రాఫేల్‌ తీర్పు సమయంలో సుప్రీంకోర్టు కూడా వాడిందని రాహుల్‌ చెప్పారని భాజపా ఎంపీ మీనాక్షీ లేఖి పిటిషన్‌ దాఖలు చేశారు.రాహుల్‌ గాంధీ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.చౌకీదార్‌ అని సుప్రీం ఆదేశాల్లో తెలిపామా అని సీజేఐ ఈ సందర్భంగా ప్రశ్నించారు. అసలు చౌకీదార్‌ ఎవరని సీజేఐ అన్నారు. చౌకీదార్‌ చోర్‌ హై అనేది రాజకీయ ప్రచార నినాదమని రాహుల్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి కోర్టుకు తెలిపారు.