కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ అమేథిలో నామినేషన్ దాఖలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ అమేథిలో నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్ వెంట సోనియా, ప్రియాంక, రాబర్ట్ వాద్రా కూడా వెళ్లారు. నామినేషన్ వేసేందుకు ఏప్రిల్ 10 బుధవారం రాహుల్ గాంధీ కార్యకర్తలు, నాయకులతో కలిసి ర్యాలీగా వెళ్లారు. ర్యాలీలో భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అమేథి లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్నారు.
Read Also : మీ పద్దతి బాగోలేదు : ఈసీని కలిసి వినతిపత్రం ఇచ్చిన చంద్రబాబు
గాంధీల కుటుంబానికి అమేథి నియోజకవర్గం కంచుకోటగా నిలుస్తోంది. ఇప్పటికే అమేథి నుంచి రాహుల్ 3 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అమేథిలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీతో రాహుల్ తలపడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 4న కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానానికి రాహుల్ నామినేషన్ వేశారు. రాహుల్ తొలిసారి రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారు.
2004 నుంచి రాహుల్ అమేతికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో రాహుల్‌కు పోటీగా బీజేపీ నేత స్మృతి ఇరానీని బరిలోకి దిగింది. అయితే రాహుల్‌పై స్మృతి ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికల్లోనూ రాహుల్‌పై పోటీకి బీజేపీ మరోసారి ఆమెనే ఎంచుకుంది. అమేథి పోరుకు ఎస్పీ-బీఎస్పీ కూటమి దూరంగా ఉండటంతో వీరిద్దరి మధ్యే ప్రధానంగా పోటీ ఉండనుంది.
Read Also : పోలింగ్‌కు ముందు సానుభూతి కోసం చంద్రబాబు కుట్రలు