Congress President Election: మళ్లీ రాహుల్ జపం..! రాహుల్ గాంధీనే పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలి.. ఆ రాష్ట్రాల్లో ఏకగ్రీవ తీర్మానాలు

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ విముఖత వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఎన్నిక ద్వారా అధ్యక్షుడిని ఎంపిక చేసేలా సిడబ్ల్యూసీ నిర్ణయించింది. ఈ నెల 22న ఎన్నిక ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ రాహుల్ జపం మొదలైంది. రాహుల్ గాంధీనే పార్టీ అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టాలంటూ ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ కాంగ్రెస్ కమిటీలు తీర్మానాలు చేశాయి. వాటిలో బాటలో నడిచేందుకు మరికొన్ని రాష్ట్రాల పార్టీ కమిటీలు సిద్ధమవుతున్నాయి.

Congress President Election: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ విముఖత వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకొనేందుకు ఎన్నికల ప్రక్రియను నిర్వహించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నిర్ణయించింది. ఈనెల 22న అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. 24 నుంచి 30వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. అక్టోబర్ 17న అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయి. రెండు రోజుల అనంతరం ఫలితాలు వెల్లడిస్తారు. అయితే ప్రస్తుతం ఈ ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు పలువురు కాంగ్రెస్ సీనియర్లు ఆసక్తి చూపుతున్నారు.

Rahul Gandhi Helps Little Girl: భారత్ జోడో యాత్రలో ఆసక్తికర ఘటన.. చిన్నారి పాదరక్షలను సరిచేసిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్

రాహుల్ గాంధీ 2017 నుండి 2019 వరకు కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగాడు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయంతో ఆయన రాజీనామా చేశారు. తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ కొనసాగుతున్నారు. రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని పార్టీ అగ్రనాయకత్వం కోరినప్పటికీ ససేమీరా అన్నాడు. పలువురు పార్టీ సీనియర్లు రాహుల్ పలు దఫాలుగా భేటీ అయ్యి రాహుల్ ను బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలితం కనిపించలేదు. తాజాగా రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఇటీవల విలేకరులు రాహుల్ ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే విషయంపై ప్రశ్నించగా.. నేను అధ్యక్షుడిని అవుతానా లేనా అనేది సిడబ్ల్యూసీ నిర్వహించే ఎన్నిక ద్వారా తేలుతుంది. అయినా, నేను ఏం చేయాలో స్పష్టంగా నిర్ణయించుకున్నాను. నా మనసులో ఎలాంటి గందరగోళం లేదని రాహుల్ అన్నారు.

Congress president Election : కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి కోసం త్వరలోనే ఎన్నికలు..

మరికొద్దిరోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో.. రాహుల్ గాంధీనే పార్టీ పగ్గాలు చేపట్టాలంటూ రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల కాంగ్రెస్ కమిటీలు ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. రాహుల్ తన నిర్ణయం మార్చుకోవాలని, పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని ఆ రెండు రాష్ట్రాల పార్టీ కమిటీలు విజ్ఞప్తి చేశాయి. 2017లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు రాష్ట్ర యూనిట్లు ఇదే తీర్మానాన్ని ఆమోదించాయి. ప్రస్తుతం రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల కాంగ్రెస్ కమిటీల బాటలో మరికొన్ని రాష్ట్రాల కాంగ్రెస్ కమిటీలు నడిచేందుకు సిద్ధమవుతున్నాయి. మరో వారంరోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనున్న క్రమంలో రాహుల్ జపం ఊపందుకోవటం ఆసక్తికరంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు