Rahul Gandhi Helps Little Girl: భారత్ జోడో యాత్రలో ఆసక్తికర ఘటన.. చిన్నారి పాదరక్షలను సరిచేసిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్

రాహుల్ గాంధీ ఆదివారం ఉదయం పాదయాత్ర ప్రారంభించిన కొద్దిసేపటికి.. స్థానిక వ్యక్తి ఆరేళ్ల పాపతో రాహుల్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. రాహుల్ కంటే ముందు ఆ చిన్నారి చేయి పట్టుకొని నడుస్తున్నాడు. ఆ చిన్నారి కాళ్లకు ఉన్న పాదరక్షల్లో ఒకటి ఊడిపోతుండటంతో చిన్నారి నడిచేందుకు ఇబ్బంది పడింది. దీనిని గమనించిన రాహుల్ గాంధీ ఆ చిన్నారి పాదరక్షలను స్వయంగా సరిచేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Rahul Gandhi Helps Little Girl: భారత్ జోడో యాత్రలో ఆసక్తికర ఘటన.. చిన్నారి పాదరక్షలను సరిచేసిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్

Rahul Gandhi

Rahul Gandhi Helps Little Girl: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర ఆదివారం కేరళలోని హరిపాడ్ నుంచి తిరిగి ప్రారంభమైంది. ఉదయం 6:30 గంటల తర్వాత ప్రారంభమైన యాత్రలో రాహుల్ గాంధీ రోడ్డుకు ఇరువైపులా వేచి ఉన్న ప్రజలకు అభివాదంచేస్తూ ముందుకు సాగారు. మధ్యమధ్యలో ప్రజల వద్ద ఆగుతూ వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరాతీశారు. మార్గం మధ్యలో ఉన్న హోటల్ వద్ద ఆగి టీ తాగాడు.

Bharat jodo yatra: కేరళలో ఉత్సాహంగా సాగుతున్న రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’.. ఫొటో గ్యాలరీ..

యాత్ర 11వ రోజు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్న ఆరేళ్ల పాపకు పాదరక్షలను సరిచేస్తున్న వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోను కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తూ.. ‘స్వచ్ఛమైన ప్రేమ అంటే ఇలా ఉంటుంది’ అంటూ పేర్కొంటున్నారు.

రాహుల్ గాంధీ ఆదివారం ఉదయం పాదయాత్ర ప్రారంభించిన కొద్దిసేపటికి.. స్థానిక వ్యక్తి ఆరేళ్ల పాపతో రాహుల్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. రాహుల్ కంటే ముందు ఆ చిన్నారి చేయి పట్టుకొని నడుస్తున్నాడు. ఈ క్రమంలో ఆ చిన్నారి కాళ్లకు ఉన్న పాదరక్షల్లో ఒకటి ఊడిపోతుండటంతో చిన్నారి నడిచేందుకు ఇబ్బంది పడింది. వెనుకాలే ఉన్న రాహుల్ గాంధీ ఆ చిన్నారి ఇబ్బందిని గమనించాడు. వెంటనే ఆ చిన్నారిని ఆపి ఆమె పాదానికి ఉన్న పాదరక్షను రాహుల్ స్వయంగా సరిచేశాడు. అనంతరం ఆ చిన్నారి చేయిని పట్టుకొని కొద్దిదూరం పాదయాత్రలో ముందుకు సాగారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం పొందుతుంది. వీడియోను లక్షలాది మంది వీక్షిస్తూ, లైక్ లు చేస్తున్నారు. ఈ వీడియోను చూసిన అధికశాతం మంది రాహుల్ గాంధీని ప్రశంసిస్తున్నారు. ఓ నెటిజన్ “చాలా భావోద్వేగ క్షణం! చాలా స్వచ్ఛమైనది!” అంటూ పేర్కొన్నాడు.