కేరళ టూర్ : ఆలయాల్లో రాహుల్ సాష్టాంగ నమస్కారాలు

  • Publish Date - April 17, 2019 / 06:32 AM IST

కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. వయనాడ్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన ప్రచారం ముమ్మరం చేశారు.కేరళలోని వయనాడ్ జిల్లా వ్యాలీలోని పుణ్యక్షేత్రం అయిన తిరునెల్లి దేవాలయంలో ప్రత్యేకంగా పూజలు చేశారు. గర్భగుడిలో కొలువై ఉన్న విష్ణుభగవానుడికి రాహుల్ సాష్టాంగ నమస్కారాలు చేశారు. 

సముద్ర మట్టానికి 900 మీటర్లు అంటే 3వేల అడుగుల ఎత్తులో ఈ దేవాలయం ఉంటుంది. తిరునెల్లిలో విష్ణువు కొలువై ఉన్నారు. స్వయంగా బ్రహ్మదేవుడు ఈ ఆలయాన్ని కట్టించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ తిరునెల్లి దేవాలయం దర్శనం నుంచి వైకుంఠానికి దారి ఉందని చెబుతారు. ఇక్కడకు ప్రతి రోజు బ్రహ్మ.. విష్ణువును పూజించడానికి వస్తాడని చెబుతుంటారు. ఆధారాలు కూడా పూజారులు చూపిస్తారు. అందువల్లే ఈ దేవాలయం సందర్శిస్తే మన తల రాత రాసే సమయంలో.. ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే బ్రహ్మ మారుస్తాడని భక్తుల విశ్వాసం.

రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తుండటంతో.. మొదటగా ఈ ఆలయానికి వచ్చారు. ప్రత్యేకంగా పూజలు చేశారు. సాష్టాంగ సమస్కారం చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు.