కరోనా వైద్యసేవలన్నీ మెట్రోలకే పరిమితం. అలాగని ఎక్కడ కరోనా సోకినా వాళ్లను సిటీలకు తీసుకెళ్లడమూ కష్టమే. దానికితోడు మెట్రీలన్నీ రెడ్ జోన్సే. అందుకే కేంద్రం కొత్తగా ఓ ఆలోచన చేసింది. ఏలాగూ రైల్వేలు ఇప్పట్లో పూర్తిగా నడవవు. చాలా బోగీలు ఖాళీగానే ఉన్నాయి. మరి వాటినే isolation wardలుగా మార్చేస్తే?
ఇప్పటికే కొన్నిచోట్ల రైల్ బోగీలనే ఐసోలాషన్ వార్డులు తయారుచేశారు. లాక్‌డౌన్ ఎత్తివేసిన తరవాత Second Wave Novelఒక్కసారిగా పెరుగుతాయన్న అంచనాల మధ్య… చిన్న, పెద్ద టౌన్‌లు, గ్రామాలకు ఈ “train hospitals”తీసుకెళ్లాలన్న ప్రతిపాదనుంది. ఒకేసారి కరోనా రోగులు పెరిగితే ఇప్పుడున్న వైద్య సౌకర్యాలేమీ సరిపోవు. బెడ్స్ కొరత విపరీతంగా ఉంది.
ఇప్పటికే 5,150 రైల్వే బోగీలను ఐసోలేషన్ సెంటర్లుగా మార్చేశారు. ఇవన్నీ నాన్ ఏసీ బోగీలు. సెంటర్లేంటి? oxygen,ICU,ventilator facilitiesలతో అసలు హాస్పటల్స్‌గా మార్చేస్తే? ఇదంతా కేసులు పెరిగినప్పుడే. మే 15నాటికి మొత్తం కేసులు 65వేలకు చేరుతాయని, ఆగస్ట్ 15నాటికి 2.74 కోట్లకే చేరుతాయని నీతి అయోగ్ భయపడుతోంది. అసలు రైల్వే బోగీలను హాస్పటల్స్‌గా మార్చన్నది ప్రధాని మోడీ ఆలోచనంట.
ఇంతవరకు, మొత్తం 40వేల కేసుల్లో 20శాతం మందికే వైద్యసౌకర్యాలు అవసరం. ఈ“train hospitals”ను మహమ్మారి అదుపులోకి వచ్చిన తర్వాతా కొనసాగించాలి. జాతీయ విపత్తలప్పడు వీటి అవసరం ఉంటుందని మోడీ భావిస్తున్నారు.
దేశంలో ఇప్పటిదాకా COVID-19 సౌకర్యాల్లో మూడంచలున్నాయి. పాజిటీవ్ వచ్చినా లక్షణాలు లేకపోతే, ఇంతకుముందు కరోనా వచ్చిన వారితో కాంటాక్ట్‌లో ఉంటే అతన్నిLevel-Iలో ఉంచుతున్నారు. ఇక Level-II అంటే కోవిడ్ హెల్త్ సెంటర్లు. ఇక్కడ, కరోనా వ్యాధి తీవ్రత సాధారణంగా ఉన్నవాళ్లను చేర్చుకొంటన్నారు. ఇక Level-IIIఅంటే కోవిడ్ హాస్పటల్స్. ఇక్కడ వెంటిలేటర్లు, ఐసీయు సౌకర్యాలుంటాయి. ఇక్కడ తక్షణ వైద్యసౌకర్యాలు కావాల్సినవారికి పంపిస్తారు.
ర్వైల్వే, ఆరోగ్యమంత్రిత్వ శాఖలు కలసి ఐదులేలకుపైగా బోగీలను Level-I isolation centresగా మార్చేసినా, ఇంతవరకు వాడటంలేదు. ఇప్పుడు వీటిని కావాల్సిన ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read | ముంబైలో కరోనా వ్యాప్తి చేస్తుంది టాయిలెట్లే