ATVM Smart Card : ఆన్ లైన్‌‌లో రైల్వే స్మార్ట్ కార్డు, ఎలా రీచార్జ్ చేసుకోవాలంటే

ఆన్ లైన్ లోనే తమ కార్డులను రీచార్జ్ చేసుకొనే అవకాశం కల్పిస్తున్నట్లు రైల్వే శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. స్మార్ట్ కార్డు ఉన్న ప్రయాణీకులు 'UT Sonmobile' వెబ్ పోర్టల్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని, తద్వారా...రీచార్జ్ చేసుకోవచ్చని వెల్లడించింది.

Smart Card

Online Recharge : స్మార్ట్ కార్డు…ఇప్పుడు ప్రజా రవాణాలో కీలక పాత్ర పోషిస్తోంది. అందులో రైల్వే శాఖ ఒకటి. అయితే..రీచార్జ్ ల విషయంలో కొన్ని సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. స్మార్ట్ కార్డులో బ్యాలెన్స్ అయిపోతే..ప్రయాణీకులు రీచార్జ్ కోసం బుకింగ్ కౌంటర్స్ దగ్గరకు రావాల్సి ఉంటుంది. క్యూ లైన్ లో నిలబడడం, సమయం వృధా అవుతుండడంతో ప్రయాణీకులు నిరుత్సాహానికి గురయ్యే వారు. ఆన్ లైన్ లో రీచార్జ్ ఉంటే బాగుంటుందని అనుకున్నారు. వీరి కోరిక నెరవేరింది.

Read More : Telangana Secretariat: సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన కేసీఆర్..

ఇక నుంచి ఆన్ లైన్ లోనే తమ కార్డులను రీచార్జ్ చేసుకొనే అవకాశం కల్పిస్తున్నట్లు రైల్వే శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. స్మార్ట్ కార్డు ఉన్న ప్రయాణీకులు ‘UT Sonmobile’ వెబ్ పోర్టల్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని, తద్వారా…రీచార్జ్ చేసుకోవచ్చని వెల్లడించింది. సమస్యకు పరిష్కారంగానే ఇప్పుడు ఆన్ లైన్ లో స్మార్ట్ రీ చార్జ్ సదుపాయం కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించడానికి స్మార్ కార్డు వినియోగదారులంతా…ఆన్ లైన్ పద్దతిని ఉపయోగించుకోవాలని సూచించారు.

Read More : Amaravati : అమరావతి అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్

ఎలా రీ చార్జ్ చేసుకోవాలి ?
ముందుగా..http://www.utsonmobile.indianrail.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి.
స్మార్ట్ కార్డు రీ చార్జ్ ఆఫ్షన్ ను ఎంచుకుని కార్డు మెంబర్ ను ఎంటర్ చేయాలి.

అనంతరం డబ్బులు ఎంతో నమోదు చేయాలి.
డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ దేని ద్వారా చేయాలని అనుకున్నారో..ఆఫ్షన్ ను ఎంచుకుని..రీ చార్జ్ చేసుకోవాలి.

పేమెంట్ అయిపోగానే…వినియోగదారులు ATVMకు వెళ్లాలి. అనంతరం ATVM పైన స్మార్ట్ కార్డు పెట్టి రీ చార్జ్ స్మార్ట్ కార్డు ఆఫ్షన్ ఎంచుకోవాలి.
ATVM ఆటోమెటిక్ గా వివరాలు క్రోడికరిస్తుంది. అనంతరం స్మార్ట్ కార్డులోకి బ్యాలెన్స్ వస్తుంది.

Read More : BMC Fine : ఉమ్మినవారికి రూ.39 లక్షలు.. మాస్క్ లేనందుకు రూ.60 కోట్ల జరిమానా