BMC Fine : ఉమ్మినవారికి రూ.39 లక్షలు.. మాస్క్ లేనందుకు రూ.60 కోట్ల జరిమానా
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసిన వారికి బొంబాయి మెట్రో పాలిటన్ సిటీ అధికారులు భారీ జరిమానా విధించారు. కరోనా సమయంలో నిబంధనలు అతిక్రమించి రోడ్లపై, రద్దీ ప్రదేశాల్లో ఉమ్మివేసిన వారినుంచి రూ.39 లక్షల రూపాయల జరిమానా వసూలు చేశారు.

Bmc Fine
BMC Fine : కరోనా నివారణ అనేది కష్టం కావడంతో దానిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు దృష్టిపెట్టాయి. దేశంలోకి కరోనా వచ్చిన నాటి నుంచే కరోనా నిబంధనలు తీసుకొచ్చాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మాస్కు, సామాజిక దూరంతోపాటు ప్రతిఒక్కరు చేతులు శానిటైజ్ చేసుకోవాలని ప్రభుత్వాలు ప్రజలకు అర్ధమయ్యే రీతిలో తేలిపోయాయి. అయితే ఎన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా కేసులు మాత్రం అనుకున్నదానికంటే ఎక్కువే వచ్చాయి.
ఇక ఇదే సమయంలో కరోనా నిబంధనలు ఉల్లగించిన వారికీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జరిమానా విధించాయి. కొన్ని రాష్ట్రాలు భారీ జరిమానాలు విడిస్తే మరికొన్ని రాష్ట్రాలు మాత్రం కొద్దీ మొత్తంలో జరినామా విధించాయి. ఇక తాజాగా ఈ జరిమానాలకు సంబందించిన వివరాలను ముంబై(బొంబాయి) మున్సిపల్ కార్పొరేషన్ విడుదల చేసింది.
బహిరంగ స్థలాల్లో ఉమ్మివేసిన వారికి రూ. 200 జరిమానా విధించగా దాదాపు 19,000 మంది వ్యక్తుల నుంచి రూ.39 లక్షల జరిమానా వసూలు చేసినట్లు బీఎంసీ డిప్యూటీ కమిషనర్ సంగీత ఓ అధికారిక ప్రకటనలో తెలిపారు. ఇక బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించనందుకు కరోనా మహమ్మారి ప్రారంభమైన 2020 మార్చి నుండి రూ.57 కోట్ల జరిమానా వసూలు చేసినట్లు బీఎంసీ గతంలోనే ప్రకటలో తెలిపింది.
ఇక మహరాష్ట్రాలో ఇప్పుడిప్పుడే పరిస్థితి అదుపులోకి వస్తుంది..ముఖ్యంగా స్కూళ్లు సైతం రీ ఓపెన్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు సైతం చేస్తోంది. కాగా శుక్రవారంనాడు ముంబైలో 309 కొత్త కొవిడ్ కేసులు నమోదుకాగా..8 మంది దుర్మరణం చెందారు.