Amaravati : అమరావతి అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తాడేపల్లి గ్యాంగ్‌ రేప్‌ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ ఆరీఫ్‌ తెలిపారు. ఏ1 నిందితుడు కృష్ణ కిశోర్‌, ఏ2 నిందితుడు షేక్‌ హబీబ్‌లను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. 45 రోజుల తర్వాత ఇద్దరు నిందితులను అరెస్టు చేసి మీడియా ముందు హాజరుపరిచారు పోలీసులు.

Amaravati : అమరావతి అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్

Amaravati

Amaravati : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తాడేపల్లి గ్యాంగ్‌ రేప్‌ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ ఆరీఫ్‌ తెలిపారు. ఏ1 నిందితుడు కృష్ణ కిశోర్‌, ఏ2 నిందితుడు షేక్‌ హబీబ్‌లను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. 45 రోజుల తర్వాత ఇద్దరు నిందితులను అరెస్టు చేసి మీడియా ముందు హాజరుపరిచారు పోలీసులు. ఇక ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన ఆరీఫ్.. జూన్‌ 19న తాడేపల్లి అత్యాచారం ఘటన జరిగిందని ఆయన వివరించారు.

కాబోయే భర్తను కట్టేసి యువతిని ఇద్దరు నిందితులు రేప్‌ చేసారు. నిందితుడిని విజయవాడ రైల్వే స్టేషన్‌లో అరెస్ట్‌ చేశామని ఎస్పీ ఆరీఫ్‌ తెలిపారు. నిందితులకు నేర్చెరిత్ర ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.. అత్యాచారానికి ముందు ఒక వ్యక్తిని నిందితులు హత్య చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు.

రాగి తీగలను చోరీ చేస్తుండగా చూశాడని పల్లీలు అమ్మే వ్యక్తిని దారుణంగా చంపారని ఆయన తెలిపారు. అనంతరం నదీ తీరంలో యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారన్నారు. ఈ ఘటనలో పాల్గొన్న మరో నిందితుడు పరారీలో ఉన్నాడని ఎస్పీ ఆరీఫ్‌ తెలిపారు. కాగా అప్పట్లో ఈ కేసు పెద్ద దుమారమే లేపింది. సుదీర్ఘ దర్యాప్తు అనంతరం ముగ్గురు నిందితుల్లో ఇద్దరినీ అరెస్ట్ చేశారు పోలీసులు, మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.