Rajasthan : హెలికాప్టర్‌‌లో కోడలిని తీసుకొచ్చిన దళిత కుటుంబం

కోడలు జీవితాంతం గుర్తుండేలా ఓ దళిత కుటుంబం ప్రయత్నించింది. ఇంటికి ఆమెను తీసుకొచ్చేందుకు ఏకంగా హెలికాప్టర్ ను ఉపయోగించారు.

Rajasthan : హెలికాప్టర్‌‌లో కోడలిని తీసుకొచ్చిన దళిత కుటుంబం

Rajastan

Updated On : December 17, 2021 / 10:40 AM IST

Rajasthan Bride : వివాహం అయిన అనంతరం కోడలు జీవితాంతం గుర్తుండేలా ఓ దళిత కుటుంబం ప్రయత్నించింది. ఇంటికి ఆమెను తీసుకొచ్చేందుకు ఏకంగా హెలికాప్టర్ ను ఉపయోగించారు. పుట్టింటి నుంచి మెట్టింటికి రాబోతున్న కోడలికి ఘనంగా స్వాగతం పలికారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి ఓ హెలికాప్టర్ ను అద్దెకు తీసుకుంది. డబ్బున్న కుటుంబం ఏమో అని అనుకొనేరు. కాదు..ఓ పేదింటి కుటుంబం. అయినా..సరే…కోడలికి మధురమైన జ్ఞాపకం పంచిందా కుటుంబం. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. బార్మర్ జిల్లాలో పాక్ సరిహద్దు సమీపంలో జసేఢార్ ఢామ్ లో బిధానియన్ కుటుంబం నివాసం ఉంటోంది. ఇతనికి ధనీలో మంగళవారం రాత్రి దియాతో వివాహం జరిగింది.

Read More : Shyam Singha Roy : మూడు నెలలు.. మూడొందల మంది.. శ్యామ్ సింగరాయ్ సెట్ కోసం

పెళ్లి కార్యక్రమాలు అన్ని ముగిశాయి. అప్పగింతల పూర్తి అయిన అనంతరం హెలికాప్టర్ రావడంతో వధువు కుటుంబం ఆశ్చర్యపోయింది. అందులో నూతన వధూవరులు వెళుతారని చెప్పడంతో వివాహానికి వచ్చిన వారు ఆశ్చర్యపోయారు. వధూవరులిద్దరూ హెలికాప్టర్ లో జసేధార్ ధామ్ కు చేరుకున్నారు. హెలికాప్టర్ చూడగానే గ్రామస్తులు భారీగా తరలివచ్చారు.

Read More : Omicron Variant In India: దేశంలో పెరిగిన కరోనా కేసులు.. టెన్షన్ పెట్టేస్తున్న ఒమిక్రాన్!

దీంతో హెలికాప్టర్ ల్యాండ్ చేయడం కష్టతరమైంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టడంతో హెలికాప్టర్ నుంచి నూతన వధూవరులిద్దరూ దిగారు. అయితే…హెలికాప్టర్ ను అద్దెకు తీసుకోవడానికి వరుడి కటుంబం కాస్త కష్టపడాల్సి వచ్చింది. తొలుత మాట్లాడుకున్న హెలికాప్టర్ యజమాని చివరి నిమిషంలో చేతులెత్తేశారు. దీంతో మరో హెలికాప్టర్ బుక్ చేసుకోవడానికి మరిన్ని డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చింది. మొత్తంగా లక్షలు వెచ్చించి కోడలిని ఇంటికి తీసుకొచ్చిందా ఆ దళిత కుటుంబం.