Shyam Singha Roy : మూడు నెలలు.. మూడొందల మంది.. శ్యామ్ సింగరాయ్ సెట్ కోసం

సినిమాలో రెండు కథలుండగా ఒకటి ప్రజెంట్‌, మరొకటి 70వ దశకంలో బెంగాల్‌లో జరుగుతుంది. అప్పటి బెంగాల్ కి సంబంధించిన సెట్స్ అన్ని హైద్రాబాద్‌లోనే వేశామని..........

Shyam Singha Roy : మూడు నెలలు.. మూడొందల మంది.. శ్యామ్ సింగరాయ్ సెట్ కోసం

Shyam Singh Roy

Shyam Singha Roy :  నాని హీరోగా డ్యూయల్ రోల్ లో రాబోతున్న సినిమా శ్యామ్ సింగరాయ్. ఇందులో కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్, సాయి పల్లవి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రెండు కథలతో ఈ సినిమా సాగనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి మంచి స్పందన లభించింది. డిసెంబర్ 24 న ఈ సినిమా విడుదల అవ్వనుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. తాజాగా ఈ సినిమా ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల మీడియాతో మాట్లాడారు.

ఈ సినిమాలో రెండు కథలుండగా ఒకటి ప్రజెంట్‌, మరొకటి 70వ దశకంలో బెంగాల్‌లో జరుగుతుంది. దాంతో అప్పటి బెంగాల్ కి సంబంధించిన సెట్స్ వేసి సినిమాని షూట్ చేశారు. ఈ సినిమాకి వేసిన సెట్స్ గురించి శ్యామ్ సింగరాయ్ ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల ఆసక్తికర విషయాలని వెల్లడించారు. 70వ దశకంలోని బెంగాల్ ని చూపించడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని, ఇందుకోసం దాదాపు మూడేళ్ల పాటు రీసెర్చ్ చేశామని తెలిపారు. గత ఏడాది లాక్‌డౌన్‌ సమయంలో బెంగాల్‌లోనే ఉండిపోయామని అన్నారు. సౌత్, నార్త్ ఒక రకమైతే బెంగాల్‌లో మరోలా ఉంటుందని, అక్కడి ఆర్కిటెక్చర్, టెంపుల్స్ అన్నింటిపై పరిశోధించానని అన్నారు.

Sonu Nigam : అప్పగింతల్లో స్టార్ సింగర్ ఎంట్రీ.. ఏడుపులు పోయి అందరి మొహాల్లోనూ నవ్వులు..

ఈ బెంగాల్ సెట్స్ అన్ని హైద్రాబాద్‌లోనే వేశామని, దీంట్లో చూపించే ఓ ప్రింటింగ్ ప్రెస్ కోసం చాలా కష్టపడ్డామని, అప్పుడు వాడిన పేపర్, టెక్స్ట్ ఇలా అన్నింటి గురించి తీలుసుకొని వాటిని తీసుకొచ్చి రీక్రియేట్ చేశామన్నారు. ఈ సినిమాకు సంబంధించిన అతి పెద్ద సెట్ టెంపుల్ సెట్. దేవదాసిలకు సంబంధించిన టెంపుల్ అంటే ఎలా ఉంటుంది అని చాలా రీసెర్చ్ చేసి ఆ సెట్ ని వేసాము. అందులోనే చాలా సీన్స్ చిత్రీకరించారు. ఈ సినిమాకి టెంపుల్ సెట్ మేజర్ హైలెట్ అవుతుందని అన్నారు. ఆ సెట్‌ను హైద్రాబాద్‌లోనే ఓ ప్లేస్ లో ఆరు ఎకరాల్లో వేశామని, ఆ సెట్ కోసం మూడు నెలల పాటు, రోజూ మూడొందల మంది శ్రమించారని తెలియచేశారు. ఈ సెట్ కోసం ఖర్చు కూడా బాగానే అయినట్టు తెలిపారు.

ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కి నానితో ఇది మూడో సినిమా కావడం విశేషం. నాని ‘కృష్ణ గాడి వీర ప్రేమకథ’ సినిమాతో ఆర్ట్ డైరెక్ట్ గా మారిన అవినాష్ తర్వాత నాని తో మళ్ళీ ‘జెర్సీ’ సినిమా చేశారు. ఇప్పుడు ‘శ్యామ్ సింగరాయ్’ చేస్తున్నారు. తర్వాత నానితో ‘దసరా’ సినిమా కూడా చేయబోతున్నారు.

Oorvashi Rautela : ఒకప్పుడు కంటెస్టెంస్ట్.. ఇప్పుడు మిస్ యూనివర్స్ జడ్జి.. రికార్డు క్రియేట్ చేసిన బాలీవుడ్ నటి