Rajasthan Exit Polls 2023: రాజస్థాన్ లో ఆనవాయితీకే ఎగ్జిట్ పోల్స్ పట్టం.. నిజమయ్యేనా?

రాజస్థాన్ రాష్ట్రంలో 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎగ్జిట్ పోల్స్ సైతం కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని చెప్పాయి. వాటి అంచనాలను నిజంచేస్తూ ..

Rajasthan

Rajasthan Election 2023: రాజస్థాన్ రాష్ట్రంలో మరోసారి ఆనవాయితీ కొనసాగనుందా? ప్రజలు మరోసారి అధికార మార్పిడికే మొగ్గుచూపారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గురువారం సాయంత్రం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఈ విషయానికి బలంచేకూర్చుతున్నాయి. 1993 నుంచి ప్రతీ ఐదేళ్లకోసారి అధికార మార్పిడి జరుగుతుంది. ఆనవాయితీ ప్రకారం రాజస్థాన్ లో ఇప్పటి వరకు వరుసగా ఒకే పార్టీ రెండోసారి అధికారంలోకి రాలేదు. ఈ దఫా కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వస్తామని, రాష్ట్రంలో ఆనవాయితీని బ్రేక్ చేస్తామని బలంగా చెబుతూ వచ్చింది. కానీ, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం కాంగ్రెస్ నేతల వాదనలకు వ్యతిరేకంగా ఉన్నాయి.

Also Read : Revanth Reddy: ఎగ్జిట్ పోల్స్ పై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. వాళ్లు మాత్రమే శత్రువులు.. మిగిలినవారంతా మాకు మిత్రులే

బీజేపీకే ఎగ్జిట్ పోల్స్ పట్టం..
గురువారం సాయంత్రం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ వివరాలను పరిశీలిస్తే.. పీపుల్స్ పల్స్.. కాంగ్రెస్ 73-95, బీజేపీ 95-115, ఆర్ఎల్పీ-ఆర్ఎస్పీ 2-6 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పింది. శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ .. కాంగ్రెస్ – 56-72, బీజేపీ – 124-136, ఆర్ఎల్పీ-ఆర్ఎస్పీ – 0, ఇతరులు 3-10 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. CNN న్యూస్18.. కాంగ్రెస్ 74, బీజేపీ 111, ఆర్ఎల్పీ-ఆర్ఎస్పీ 0, ఇతరులు 14 స్థానాల్లో విజయం సాధిస్తాయని అంచనా వేసింది. ఈ మూడు ఎగ్జిట్ పోల్స్ లోనూ బీజేపీనే అధికారంలోకి వస్తుందని స్పష్టమవుతోంది.

Also Read : Telangana Exit Poll Result 2023 : తెలంగాణలో గెలిచేది ఈ పార్టీనే..! ఎగ్జిట్ పోల్స్ అంచనాలు

2018లో ఫలితాలు ఇలా ..
రాజస్థాన్ రాష్ట్రంలో 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎగ్జిట్ పోల్స్ సైతం కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని చెప్పాయి. వాటి అంచనాలను నిజంచేస్తూ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 100 సీట్లు వచ్చాయి. బీజేపీకి 73, బీఎస్పీకి ఆరు సీట్లు వచ్చాయి. ఇతరులకు 20 స్థానాల్లో విజయం సాధించారు. మెజార్టీకోసం కాంగ్రెస్ కు 101 మంది ఎమ్మెల్యే అవసరం. దీంతో కాంగ్రెస్ పార్టీ స్వతంత్రుల సహాయంతో అధికారంలోకి వచ్చింది.

 

Rajasthan

 

ట్రెండింగ్ వార్తలు